Coffee Facial Tips: ఇంట్లోనే కాఫీ పొడితో ఫేషియల్ ఇలా చేయండి.. మీ ముఖం అందంగా మెరిసిపోతుంది..చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. శుభ్రపరచుకోవడం చాలా ముఖ్యం. మంచి పోషకాహారం తీసుకుంటూనే చర్మం అందంగా కనిపించడానికి సింపుల్ చిట్కాలను పాటించాలి. స్కిన్ ఆరోగ్యంగా అందంగా కనిపించడానికి చాలామంది ఫేషియల్ చేయిచుకుంటారు. ఇలా చేయడం వలన చర్మ రంధ్రాలు క్లీన్ అవ్వడమే కాదు స్కిన్ అందంగా, ఆరోగ్యంగా మెరుస్తుంది. ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో ఫేషియల్ ను చేసుకోండి. ఏదైనా ఫంక్షన్ కు వెళ్లాలనుకుంటే చర్మం మెరవడం కోసం బయటకు వెళ్లే ముందు రోజు రాత్రి కాఫీతో ఫేషియల్ చేసుకోండి. ఈ ఫేషియల్ బ్లీచ్ లా పని చేస్తుంది. కొబ్బరినూనెలో కొన్ని నీళ్లు మిక్స్ చేసి ముఖానికి బాగా పట్టించాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మసాజ్ చేయండి.ఇప్పుడు ఈ నూనెను మీ ముఖం నుండి తుడవకండి. వదిలెయ్యండి ఇలా చేయడం వలన ముఖం పొడిగా లేదా గరుకుగా మారదు.ఒక గిన్నెలో ఒక పెద్ద చెంచా కాఫీ పొడి తీసుకోండి. అందులో నిమ్మరసం వేసి బాగా కలపాలి. అందులో కొద్దిగా తేనె కలపాలి. ఈ మిశ్రమంలో ఒక చెంచా ఏదైనా ఫెయిర్‌నెస్ క్రీమ్ కలపండి. ఇప్పుడు 1 స్పూన్ రైస్ పౌడర్ మిక్స్ చేసి చిక్కగా చేసుకోవాలి. మ్యాజికల్ ఫేస్ ప్యాక్ ను స్కిన్ కు అప్లై చేయండి.. ఈ ప్యాక్‌ని జిడ్డుగా ఉన్న ముఖంపై అప్లై చేయాలి. ఈ ప్యాక్ మీకు 10 నిమిషాల్లో గొప్ప మెరుపును అందిస్తుంది. ఇలా నెలలో రెండు రోజులు వాడితే ముఖంపై ఉన్న నల్లమచ్చలన్నీ తొలగిపోతాయి.చేతులతో తేలికగా మసాజ్ చేయండి. 10 సెకన్లు చేసి అనంతరం తడి గుడ్డతో ముఖాన్ని తుడవండి. ఇప్పుడు నీళ్లతో ముఖం కడుక్కోవాలి.అనంతరం ముఖంపై తేలికపాటి మాయిశ్చరైజర్ రాయండి. ఈ ఫేస్ ప్యాక్ ను పగటి పూట కంటే రాత్రి పూట అప్లై చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖంలోని టాన్, మురికి తొలగి మెరుపు సంతరించుకుంటుంది. ఎక్కడికైనా వెళ్లే ముందు కాఫీ తో తయారు చేసుకున్న ఫేస్ ఫ్యాక్ ను చేసుకోవాలి. కాఫీ-తేనె, నిమ్మరసం ముఖాన్ని బాగా శుభ్రపరుస్తుంది. చర్మం అందంగా మెరుస్తుంది.