Andhra Pradesh Couple Approached Addanki Police Station While Family Rejects Their Love Marriage
Andhra Pradesh: పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రామంటున్న ప్రేమ జంట.. కారణమిదేనట..Love Marriage: వయసులో ప్రమేయం లేకుండా23 ఏళ్ల యువతి 60 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకోవడం.. 25 ఏళ్ల యువకుడు 55 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకోవడం వంటి ఘటనలు నిత్యం ఎక్కడో చోట వెలుగు చూస్తూనే ఉంటాయి. అది ప్రేమకున్న పవర్. ఇక డీప్ లవ్‌లో మునిగి తేలుతున్న యువతీ, యువకులు.. తమ తల్లిదండ్రులను ఎదిరించి, గుడిలోనో, ఆర్య సమాజ్లోనో పెళ్లి చేసుకున్న సందర్భాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. కొందరి ప్రేమలు సక్సెస్ అయితే, మరికొందరి ప్రేమ విషాదాన్ని నింపాయి. ఇంకొందరు..ప్రేమకు కులం, మతం, పేదరికం, డబ్బు ఏదీ అడ్డు కాదు.. ఇంకా చెప్పుకోవాలంటే ప్రేమకు వయసు కూడా అడ్డు రాదు. మనం ఎన్నో సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. వయసులో ప్రమేయం లేకుండా23 ఏళ్ల యువతి 60 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకోవడం.. 25 ఏళ్ల యువకుడు 55 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకోవడం వంటి ఘటనలు నిత్యం ఎక్కడో చోట వెలుగు చూస్తూనే ఉంటాయి. అది ప్రేమకున్న పవర్. ఇక డీప్ లవ్‌లో మునిగి తేలుతున్న యువతీ, యువకులు.. తమ తల్లిదండ్రులను ఎదిరించి, గుడిలోనో, ఆర్య సమాజ్లోనో పెళ్లి చేసుకున్న సందర్భాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. కొందరి ప్రేమలు సక్సెస్ అయితే, మరికొందరి ప్రేమ విషాదాన్ని నింపాయి. ఇంకొందరు.. మధ్యలోనే విడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి.ప్రేమ జంట పోరాటం..
తాజాగా ఓ ప్రేమ జంట తమ ప్రేమను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. కులాంతర వివాహం చేసుకున్నారన్న కారణంగా తమ తల్లిదండ్రులు విడదీయడానికి చూస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ ప్రేమ జంట. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు కలెక్టరేట్లో ఉద్యోగం చేస్తున్న చంద్రలత, అదే కలెక్టరేట్లో డ్రైవర్‌గా చేస్తున్న సతీష్ కొంత కాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే, వీరి పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దాంతో.. ఇద్దరూ పేరెంట్స్‌కి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనూ ఇద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కులాంతర వివాహం చేసుకున్నారన్న కారణంతో తమ తల్లిదండ్రులు తమను విడదీయడానికి ప్రయత్నిస్తున్నారంటూ అద్దంకి పోలీస్ స్టేషన్ వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో యువతి, యువకుడి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించారు పోలీసులు. యువతి తల్లిదండ్రులు ఆమెతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, తామిద్దరం కలిసే ఉంటామని, ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళితే తమను బలవంతంగా విడదీస్తారని భయాందోళన వ్యక్తం చేశారు యువతీ, యువకుడు. ఈ క్రమంలో.. తాము బయటకు వెళ్లమంటూ పోలీస్ స్టేషన్లోనే కూర్చున్నారు.
ఇక పోలీసులు ప్రేమ జంటకు, ఇరువురి కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరూ మేజర్స్ కావడంతో.. అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.