Dhanush: హీరోగా దర్శకుడిగా.. నిర్మాతగా ఫుల్ బిజీగా గడిపేస్తున్న ధనుష్నటుడిగా బిజీగా ఉంటూనే ఇతర రంగాల మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ప్రజెంట్ కెప్టెన్ మిల్లర్ వర్క్‌లో బిజీగా ఉన్న ధనుష్, రీసెంట్గా మరో మూవీని ఎనౌన్స్ చేశారు. తనను బాలీవుడ్‌కు పరిచయం చేసిన ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే తన కెరీర్లో మైల్స్టోన్ మూవీ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా ఓన్ డైరెక్షన్లో.నటుడిగా ఫుల్ బిజీగా ఉంటునే దర్శకుడిగా నిర్మాతగానూ బిజీ అవుతున్నారు హీరో ధనుష్. ఆల్రెడీ బిహైండ్ ది కెమెరా కూడా ప్రూవ్ చేసుకున్న ఈ కోలీవుడ్ స్టార్ ఈ సారి భారీ స్కెచ్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. నటుడిగా బిజీగా ఉంటూనే ఇతర రంగాల మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ప్రజెంట్ కెప్టెన్ మిల్లర్ వర్క్‌లో బిజీగా ఉన్న ధనుష్, రీసెంట్గా మరో మూవీని ఎనౌన్స్ చేశారు. తనను బాలీవుడ్‌కు పరిచయం చేసిన ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే తన కెరీర్లో మైల్స్టోన్ మూవీ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా ఓన్ డైరెక్షన్లో.తన 50వ సినిమాను గ్రాండ్‌గా ఎనౌన్స్ చేసిన ధనుష్ ఆ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించబోతున్నట్టుగా వెల్లడించారు. ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీలలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండటంతో ఆ రేంజ్ కంటెంట్‌తో రాబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు. దాంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఆరేళ్ల విరామం తరువాత మరోసారి మెగాఫోన్ పడుతున్నారు. నిర్మాతగా సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన ధనుష్ గత ఐదేళ్లుగా ప్రొడక్షన్‌కు దూరంగా ఉన్నారు.సరైన సబ్జెక్ట్ దొరక్కపోవటంతో ఓన్ ప్రొడక్షన్‌ను పక్కన పెట్టేశారు. లాంగ్ గ్యాప్ తరువాత సొంత బ్యానర్లో మరో మూవీకి రెడీ అవుతున్నారు ధనుష్. కెప్టెన్ మిల్లర్ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.రఘువరన్ బీటెక్, మారి లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్‌తో పాటు కాకాముట్టై లాంటి అవార్డు విన్నింగ్ సినిమాలను నిర్మించారు ధనుష్. మళ్లీ ఆ రేంజ్ కథ రాకపోవటంతో బ్రేక్ తీసుకున్నారు. ఇన్నాళ్లకు తన టేస్ట్‌కు తగ్గ కథ దొరకటంతో ప్రొడక్షన్ హౌస్ వర్క్‌ను రెజ్యూమ్ చేశారు. మరి నిర్మాతగానూ ధనుష్ మరో హిట్ ఇస్తారేమో చూడాలి.
ధనుష్ ఇన్ స్టా గ్రామ్