Eatala Rajender: తెలంగాణ బీజేపీలో ఈటలకు అదనపు అధికారాలు.. ఇవాళో రేపో కొత్త పోస్ట్‌పై ప్రకటన వెలువడే చాన్స్
ఇవాళో రేపో కొత్త పోస్ట్‌పై ప్రకటన వెలువడే చాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీలో ఇంతవరకూ లేని ప్రచార కమిటీని ఇప్పుడు కొత్తగా తెరమీదికి తీసుకొచ్చారు. ఈటల కోసం ప్రత్యేకంగా ప్రచార కమిటీ చైర్మన్ పదవి సృష్టించినట్లుగా తెలుస్తోంది.బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అదనపు అధికారాలు కట్టబెట్టనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నాట్లుగా సమాచారం. ఇవాళో రేపో కొత్త పోస్ట్‌పై ప్రకటన వెలువడే చాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీలో ఇంతవరకూ లేని ప్రచార కమిటీని ఇప్పుడు కొత్తగా తెరమీదికి తీసుకొచ్చారు. ఈటల కోసం ప్రత్యేకంగా ప్రచార కమిటీ చైర్మన్ పదవి సృష్టించినట్లుగా తెలుస్తోంది. కొద్దిరోజులుగా రాష్ట్ర నాయకత్వానికి ఈటలకు మధ్య విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం సాగింది. దీనికి కారణం రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిని ఈటల కోరుకుంటున్నట్లు సమాచారం. చేరికల కమిటీతో బాధ్యతలు తప్ప అధికారాలు లేవని భావిస్తున్నారు ఈటల రాజేందర్. ఎవర్ని సంప్రదించినా ఎలాంటి హామీలు ఇవ్వలేకపోతున్నానని అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అదే అసంతృప్తిని గతంలో అనేక సార్లు అధిష్టానానికి చెప్పారు ఈటల. అధ్యక్షుడి మార్పు లేకపోయినా, ఈటల కోసం కొత్త పోస్ట్ క్రియేట్ చేసింది బీజేపీ అధిష్టానం.
ఎందుకంటే అసలు బీజేపీలో ప్రచార కమిటీ అనిగానీ, దానికి చైర్మన్ అనిగానీ ఉండరు. ఇది కాంగ్రెస్ ఫార్ములా. కానీ ఆ ఫార్ములాను ఇప్పుడు తెలంగాణ కోసం ప్రత్యేకంగా బీజేపీ హైకమాండ్ అమలు చేయబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఈటలకు ఈ కొత్త పోస్ట్ ఇవ్వడం ఖరారైతే.. దీని రియాక్షన్ ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. కొన్నాళ్లుగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి వర్గానికి, ఈటల వర్గానికి పొసగడం లేదన్నది టాక్.
అది కాస్తా ముదిరి పూర్తిస్థాయి అసంతృప్తిగా మారింది. గతంలో బండికి తెలియకుండా ఈటల నేరుగా ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో మాట్లాడుకుని వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అదే మాట బండిని అడిగితే.. ఈటల ఎందుకు వెళ్లారో తెలీదు, అయినా వెళితే తప్పేంటి అంటూ ముక్తాయించారు. కానీ ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే ఈటల అసంతృప్తి, ఆ అసంతృప్తిని చల్లార్చే ప్రక్రియ నడుస్తున్నట్లు కనిపిస్తోంది.