Upasana Daughter Viral Pics: క్లింకార ఫొటోలు షేర్ చేసిన ఉపాసన.. ఎంత క్యూట్‌గా ఉందో..!మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. తమ గారాలపట్టికి క్లింకార అనే నామకరణం కూడా చేశారు. ఇక పాప పుట్టిన దగ్గరి నుంచి అభిమానులు క్లింకార ఫొటో కోసం ఎదురుచూస్తున్నారు. మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉపాసన క్లీంకార ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉపాసన తన తల్లిదండ్రులు క్లింకారను ఎత్తుకుని జెండా వందనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను..మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. తమ గారాలపట్టికి క్లింకార అనే నామకరణం కూడా చేశారు. ఇక పాప పుట్టిన దగ్గరి నుంచి అభిమానులు క్లింకార ఫొటో కోసం ఎదురుచూస్తున్నారు. మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉపాసన క్లీంకార ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉపాసన తన తల్లిదండ్రులు క్లింకారను ఎత్తుకుని జెండా వందనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. అమ్మమ్మ, తాతయ్యలతో క్లీంకార మొదటి స్వాతంత్ర్య వేడుకలు. ఇవి ఎంతో అమూల్యమైన క్షణాలు అనే క్యాప్షన్‌తో ఫొటోలను షేర్ చేసింది. ఐతే ఈ ఫొటోల్లో ఉపాసన తన కూతురి ఫొటోలను పాక్షికంగా మాత్రమే చూపింది.అమ్మమ్మ భుజంపై ఉన్న దుపట్టాలో సగం ముఖం దాగి ఉన్న ఫొటోలు మాత్రమే వెల్లడించింది. క్లింకార పూర్తి ఫొటోను వెల్లడించలేదు. ఇక ఈ ఫొటోనలు చూసిన మెగా అభిమానులు సో.. క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా ఉపాసన ఈ ఏడాది జూన్ 20న పాపకు జన్మనిచ్చింది. పెళ్లైన దాదాపు పదకొండేళ్లకు రామ్‌చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఇక లిటిల్ మెగా ప్రిన్స్ వచ్చాక మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్నంటాయి.క్లీంకార పుట్టిన తర్వాత తన జీవితం ఎంతో మారిపోయిందని, ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉందని ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన ఈ మేరకు అన్నారు. జీవితం విలువను తన కూతురు తనకు తెలియజేసిందని, తన వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని ఆమె అన్నారు.