Viral Video: రోడ్డు దాటుతున్న పులిని ఢీకొట్టిన కారు.. ఆ తర్వాత అది పడ్డ బాధ చూస్తే… 😭 😭భారతదేశంలో పులుల మరణాలకు ప్రధాన కారణాలలో రోడ్డు ప్రమాదాలు ఒకటి. నివేదికల ప్రకారం, 2011 నుండి 2021 వరకు రోడ్డు ప్రమాదాల కారణంగా 26 పులులు చనిపోయాయి. ఇందులో రోడ్డు ప్రమాదాల్లో 12 పులులు చనిపోగా, రైలు ప్రమాదాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో పులుల జనాభా 2006లో 1,411 నుండి 2022 నాటికి 3,682కి పెరిగింది. ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అటవీ శాఖ ఈ సమస్యను ప్రాధాన్యతపై చేపట్టాలని, నిబంధనల ప్రకారం సురక్షితమైన అండర్‌పాస్‌ను నిర్మించాలని పలువురు కోరుతున్నారు.మహారాష్ట్రలోని నాగ్జిరా అభయారణ్యానికి సమీపంలో కారు ఢీకొట్టడంతో రెండేళ్ల ఆడపులి మృతి చెందింది. గురువారం రాత్రి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన పులి మృత్యువుతో పోరాడుతూ మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. నాగ్జీరా వన్యప్రాణుల అభయారణ్యంకి చెందిన ఈ పులి పేరు T-14 గా గుర్తించారు అధికారులు. గురువారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ముర్దోలి అటవీ ప్రాంతంలోని గోండియా-కొహ్మరా హైవేను దాటుతుండగా వేగంగా వచ్చిన క్రెటా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గోండియా అటవీ విభాగం డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రమోద పంచభాయ్ నేతృత్వంలోని బృందం వెంటనే స్పాట్‌కు చేరుకుని.. ప్రమాదం తాలూకా డీటేల్స్ తెలుసుకున్నారు. పులి మృతదేహాన్ని స్థానిక వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ప్రమాదం తర్వాత పులి పడిన బాధను రెడ్డిట్ యూజర్ షేర్ చేశారు. ఈ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి.కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలైన పులి వీడియోను దిగునవ చూడండి…ఈ వీడియో చూసిన నెటిజన్లు, జంతు ప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కారు నడిపిన వాహనదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ కఠిన నిబంధనలు అమలు చేయకపోవడం పట్ల ఫైరవుతున్నారు. అస్సాంలోని కజిరంగాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నేషనల్ పార్క్ పక్కనే జాతీయ రహదారి ఉంది. కానీ ఇక్కడ 40kmph స్పీడ్ లిమిట్ అమలులో ఉంది. అయితే దారి పొడవునా కెమెరాలు అమర్చడంతో వాహనదాదులు రూల్స్ తప్పక పాటిస్తున్నారు. అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల అభయారణ్యాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు తక్కువ వేగంతో ప్రయాణించడం మంచిది. ఎందుకంటే రోడ్డు దాటుతున్న వన్యప్రాణులు వాహనాలను ఢీకొనే అవకాశం ఉంది.
“శ్రీశైల అభయారణ్యంలో స్పీడ్ లిమిట్ 30kmph ఉన్నప్పటికీ, వారు 100kmph వరకు డ్రైవ్ చేస్తారు. నా కళ్ల ముందే తల్లి, పిల్ల కోతులు చనిపోవడం చూశాను. ఇలాంటి ప్రమాదాల వల్ల ప్రతిరోజూ ఏదో ఒక జంతువు చనిపోతుంది. మానవులు మొత్తం పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు అని” ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. భారతదేశంలో పులుల మరణాలకు ప్రధాన కారణాలలో రోడ్డు ప్రమాదాలు ఒకటి. నివేదికల ప్రకారం, 2011 నుండి 2021 వరకు రోడ్డు ప్రమాదాల కారణంగా 26 పులులు చనిపోయాయి. ఇందులో రోడ్డు ప్రమాదాల్లో 12 పులులు చనిపోగా, రైలు ప్రమాదాల్లో 14 పులులు ప్రాణాలు కోల్పోయాయి. దేశంలో పులుల సంఖ్య 2006లో 1,411 ఉండగా.. 2022 నాటికి 3,682కి పెరిగింది. కాగా ఇలా అటవీ సమీప ప్రాంతాల్లో ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అటవీ శాఖ ఈ సమస్యను ప్రాధాన్యతపై చేపట్టాలని, నిబంధనల ప్రకారం సురక్షితమైన అండర్‌పాస్‌ను నిర్మించాలని పలువురు కోరుతున్నారు.