IND vs WI: చరిత్ర సృష్టించిన ‘ఆల్‌రౌండర్’ హార్దిక్.. తొలి భారత ప్లేయర్‌గా రికార్డ్.. ఇంకా బూమ్రాను అధిగమించి బౌలర్ల లిస్టులో..Hardik Pandya: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 2 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేయగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్‌తో రాణించిన హార్దిక్ రెండు అరుదైన రికార్డులను సృష్టించాడు. ఈ క్రమంలో హార్దిక్.. బూమ్రా రికార్డ్‌ను బ్రేక్ చేయడంతో పాటు..Hardik Pandya, IND vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో 3 వికెట్లు, బ్యాటింగ్‌లో 24 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓ వికెట్ తీయగానే 150 టీ20 వికెట్లను పడగొట్టిగా ఆటగాడిగా నిలిచిన హార్దిక్ మొత్తంగా 152 వికెట్లు తీసుకున్నాడు.ఈ మ్యాచ్‌కి ముందే 4000 టీ20 పరుగుల మార్క్‌ని దాటిన హార్దిక్.. పొట్టి క్రికెట్లో మొత్తంగా 4391 పరుగులు చేశాడు. ఇలా టీ20 క్రికెట్లో 150 వికెట్లు, 4000 పరుగులు చేసిన హార్దిక్.. ఈ ఘనత సాధించిన తొలి భారత్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.అలాగే ఈ మ్యాచ్‌కు ముందు జస్ప్రీత్ బూమ్రా, హార్దిక్ పాండ్యా 70 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ టీ20 వికెట్లు తీసిన ఆటగాళ్లుగా నాలుగో స్థానంలో సమంగా ఉండేవారు. అయితే ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన హార్దిక్ 73 వికెట్లతో నాలుగో స్థానాన్ని తన సొంతం చేసుకొని బూమ్రాను వెనక్కు నెట్టాడు.ఇక భారత్ తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా యుజ్వేంద్ర చాహల్ అగ్రస్థానంలో ఉన్నాడు. చాహల్ 76 మ్యాచ్‌లు ఆడి మొత్తం 93 వికెట్లతో ఈ రికార్డ్ సాధించాడు.ఇంకా 87 మ్యాచ్‌లు ఆడి 90 వికెట్లు తీసిన భువనేశ్వర్ 2వ స్థానంలో.. 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.