Abbas : ఆ డబ్బులతోనే నా కుటుంబాన్ని పోషించా.. అబ్బాస్ ఎమోషనల్ కామెంట్స్హీరోగానే కాదు విలన్ గాను నటించి మెప్పించాడు అబ్బాస్. ముఖ్యంగా ప్రేమ్ దేశం సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అబ్బాస్ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాల చేసి మెప్పించారు అబ్బాస్. అప్పట్లో అమ్మాయిల కలల రాజకుమారుడు అబ్బాస్. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఆయన సినిమాలకు దూరం అయ్యారు. అబ్బాస్ దాదాపు 50 సినిమాల్లో నటించారు. అయితే అబ్బాస్ కు మెల్లగా అవకాశాలు తగ్గడంతో ఆయన సినిమాలనుంచి తప్పుకున్నారు. అయితే ఇప్పుడు అబ్బాస్ ఎలా ఉన్నారు అని చాలా మంది నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు.90 కిడ్స్ కు అబ్బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లవర్ బాయ్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు అబ్బాస్. హీరోగానే కాదు విలన్ గాను నటించి మెప్పించాడు అబ్బాస్. ముఖ్యంగా ప్రేమ్ దేశం సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అబ్బాస్ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాల చేసి మెప్పించారు అబ్బాస్. అప్పట్లో అమ్మాయిల కలల రాజకుమారుడు అబ్బాస్. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఆయన సినిమాలకు దూరం అయ్యారు. అబ్బాస్ దాదాపు 50 సినిమాల్లో నటించారు. అయితే అబ్బాస్ కు మెల్లగా అవకాశాలు తగ్గడంతో ఆయన సినిమాలనుంచి తప్పుకున్నారు. అయితే ఇప్పుడు అబ్బాస్ ఎలా ఉన్నారు అని చాలా మంది నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. 2015 తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. ఇన్నాళ్ల తర్వాత ఆయన ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ రావడానికి ట్రై చేస్తున్నారు అబ్బాస్.ఇదిలా ఉంటే అబ్బాస్ ఓ యాడ్ లో నటించడం పై ఆయన పై చాలా విమర్శలు వచ్చాయి. ప్రముఖ టాయిలెట్ క్లినర్ లిక్విడ్ కు సంబంధించిన యాడ్ లో నటించారు అబ్బాస్. క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న అబ్బస్ ఇలా టాయిలెట్ క్లినర్ యాడ్ లో నటించడంతో ఆయనను చాలా మంది విమర్శించారు. అయితే తాజాగా దీని పై స్పందించారు అబ్బాస్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ యాడ్ పై నటించడం గురించి మాట్లాడారు.
టాయిలెట్ క్లీనర్ యాడ్‌లో నటించడం వల్ల నన్ను ఎంతోమంది ట్రోల్ చేశారు. నేను దాన్ని వాడమని చెప్పను అంతే కానీ తాగమని చెప్పలేదు అని అన్నారు. అలాగే నా పై చాలా మంది మీమ్స్ కూడా చేశారు. నా వీడియో ను వాడుకొని నా పై ట్రోల్ చేశారు. కానీ నేను దాని పై ఎప్పుడు బాధపడలేదు అన్నారు అబ్బాస్. ఆ యాడ్ చేసే సమయంలో నేను బిజీగా లేను. అందులో నటించినందుకు నాకు మంచి రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. ఆయాడ్ తో నాకు ఎనిమిదేళ్లు కాంట్రాక్ట్ ఉంది. ఆ డబ్బులతోనే నేను నా కుటుంబాన్ని పోషించా.. నను అన్ని వృత్తులను ఒకేలా చూస్తాను. చిన్న పని, పెద్ద పని అని నాకు తేడా లేదు అని తెలిపారు అబ్బాస్. న్యూజిలాండ్‌లో నివసించిన అబ్బాస్ ఇప్పుడు ఇండియాకు తిరిగి వచ్చారు. తిరిగి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే అబ్బాస్ రీ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.