Tollywood: జెట్ స్పీడ్తో సినిమా షూటింగ్స్.. 100 డేస్ టార్గెట్ పెట్టుకుంటున్న మేకర్స్..మన హీరోలు మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోతున్నారు. దర్శకుల్లో కూడా ఈ మార్పు కనిపిస్తుంది. త్రివిక్రమ్, రాజమౌళి లాంటి ఒకరిద్దరు సీనియర్స్ మినహాయిస్తే.. చాలా మంది డైరెక్టర్స్ వర్కింగ్ డేస్ తగ్గించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా 100 రోజుల టార్గెట్ పెట్టుకుంటున్నారు. ఈ మధ్యే బ్రో సినిమాను 53 రోజుల్లో పూర్తి చేశారు సముద్రఖని. తాజాగా సంక్రాంతికి రానున్న సినిమాల్ని కూడా రికార్డ్ టైమ్లో పూర్తి చేయాల్సిందే. సంక్రాంతికి రాబోయే సినిమాల్లో…టాలీవుడ్ హీరోలు కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు.. అదే టార్గెట్ 100 డేస్. అంటే ఇప్పుడేంటి 100 రోజుల సినిమా ఇచ్చేయాలని ఫిక్సైపోయారా అనుకోవద్దండోయ్..! ఇప్పుడున్న సిచ్యువేషన్లో 10 రోజుల సినిమానే రావట్లేదు ఇంకా 100 రోజులు కూడానా..? పోనీ 100 కోట్ల సినిమాలా అనుకుంటే అంతా ఈజీగా అందుకుంటున్నారు కదా..! మరి అదీ కానప్పుడు ఏంటి ఈ టార్గెట్ 100 డేస్..? మీకెందుకు ఆ శ్రమ.. మేం చెప్తాంగా ఎక్స్క్లూజివ్ స్టోరీలో ఆ డీటైల్స్..
మన హీరోలు మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోతున్నారు. దర్శకుల్లో కూడా ఈ మార్పు కనిపిస్తుంది. త్రివిక్రమ్, రాజమౌళి లాంటి ఒకరిద్దరు సీనియర్స్ మినహాయిస్తే.. చాలా మంది డైరెక్టర్స్ వర్కింగ్ డేస్ తగ్గించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా 100 రోజుల టార్గెట్ పెట్టుకుంటున్నారు. ఈ మధ్యే బ్రో సినిమాను 53 రోజుల్లో పూర్తి చేశారు సముద్రఖని. తాజాగా సంక్రాంతికి రానున్న సినిమాల్ని కూడా రికార్డ్ టైమ్లో పూర్తి చేయాల్సిందే. సంక్రాంతికి రాబోయే సినిమాల్లో హనుమాన్, ఈగల్ షూటింగ్స్ అయిపోయాయి.. వాటికెలాంటి ఇబ్బంది లేదు. కానీ మహేష్ బాబు గుంటూరు కారం, విజయ్ దేవరకొండ పరశురామ్ సినిమా, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సినిమాల షూటింగ్స్ ప్రారంభ దశలోనే ఉన్నాయి. చిరు, కళ్యాణ్ కృష్ణ సినిమా అయితే ఇంకా మొదలే కాలేదు. కానీ ఇవన్నీ సంక్రాంతి రేసులోనే ఉన్నాయి.. తీరా సంక్రాంతికి 120 రోజుల సమయమే ఉంది.
గుంటూరు కారం కొత్త షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. ఇప్పటికే ఆలస్యమైన ఈ ప్రాజెక్ట్ను 90 రోజుల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు త్రివిక్రమ్. ఇక విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమా షూటింగ్ 15 రోజుల కిందే మొదలైంది. ఇది సంక్రాంతికి రావాలంటే.. వర్కింగ్ డేస్ 100 రోజుల కంటే తక్కువే ఉండాలి. ఇక ఉస్తాద్ రేసులోకి వస్తే.. హరీష్ శంకర్ కూడా ఈ సినిమాను రికార్డ్ టైమ్లో పూర్తి చేయాల్సిందే. టార్గెట్ 100 డేస్ లిస్టులో చిరంజీవి కూడా ఉన్నారు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలను 100 రోజుల్లోనే పూర్తి చేశారు మెగాస్టార్. భోళా శంకర్ కూడా ఇంచుమించు అంతే.ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ సినిమాను కూడా ఆగస్ట్ చివర్లో మొదలుపెట్టి.. సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. మన హీరోల ప్లాన్ వర్కవుట్ అయితే.. నిర్మాతలకు పండగే. ఎందకుంటే వర్కింగ్ డేస్ తగ్గితే.. బడ్జెట్ వద్దన్నా తగ్గిపోతుంది కాబట్టి. మరి 100 రోజుల్లో సినిమా పూర్తి చేయడం అందరితో సాధ్యమవుతుందా అంటే కచ్చితంగా అవునని సమాధానం చెప్పలేము. రెండు నుంచి మూడేళ్లు సినిమా తీసే రాజమౌళి లాంటి వారితో 100 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి కావడం అసాధ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.