Telangana: ఈ పిల్లిని పట్టించిన వారికి రూ. 10 వేల బహుమతి.. నెట్టింట వైరల్ అవుతోన్న పోస్టర్లు..మంచిర్యాలకు చెందిన పర్వేజ్ కుటుంబసభ్యులు నాలుగేళ్లుగా ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. దానికి ముద్దుగా ఫ్లిప్ఫి అనే పేరు పెట్టి సాకుతున్నారు. గత నాలుగు నెలలక క్రితం హఠాత్తుగా ఫ్లిప్పి కనిపించకుండా పోయింది. పిల్లి కోసం ఏరియా అంతా వెతికినా జాడ కనిపించలేదు. ఏకంగా ఆ పిల్లి కోసం పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు. అయినా లాభం లేకపోవడంతో ఇదిగో ఇలా వాడవాడకు మిస్సింగ్ పోస్టర్లు అంటించి మా పిల్లిని వెతికి పెట్టండి ఫ్లీజ్ అని వేడుకుంటున్నారు…మంచిర్యాల, జులై 05: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోడలన్నీ ఆ పిల్లి పోటోలతో మెరిసి పోతున్నాయి. పట్టణంలో ఎక్కడ చూసినా అదే చర్చ. బాబ్ బాబ్ బాబు ఫ్లీజ్ నా పిల్లి కనిపిస్తే కాస్త చెప్పండి. నాలుగేళ్లుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. పాలే కాదు మటన్ ముక్కలు కూడా వేసి ముద్దుగా పెంచుకున్నాం. నాలుగు నెలలుగా మా పిల్లి కనిపించడం లేదు. మా పిల్లి లేకుండా మా ఇళ్లంతా చిన్న బోయింది ఎవరైనా మా పిల్లి కనిపిస్తే సమాచారం ఇవ్వండి ఫ్లీజ్ అంటూ వేడుకుంటున్నారు ఆ పిల్లి యజమాని. ఇందుకు సంబంధించిన పోస్టర్లు మంచిర్యాల జిల్లా కేంద్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అంతేకాదండోయ్ ఈ పోస్టర్లకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..మంచిర్యాలకు చెందిన పర్వేజ్ కుటుంబసభ్యులు నాలుగేళ్లుగా ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. దానికి ముద్దుగా ఫ్లిప్ఫి అనే పేరు పెట్టి సాకుతున్నారు. గత నాలుగు నెలలక క్రితం హఠాత్తుగా ఫ్లిప్పి కనిపించకుండా పోయింది. పిల్లి కోసం ఏరియా అంతా వెతికినా జాడ కనిపించలేదు. ఏకంగా ఆ పిల్లి కోసం పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు. అయినా లాభం లేకపోవడంతో ఇదిగో ఇలా వాడవాడకు మిస్సింగ్ పోస్టర్లు అంటించి మా పిల్లిని వెతికి పెట్టండి ఫ్లీజ్ అని వేడుకుంటున్నారు. మా ఫ్లిప్పిని ఆచూకీ చెపితే రివార్డు కూడా ఇస్తామంటూ ప్రకటించింది ఆ కుటుంబం. తమ పిల్లిని క్షేమంగా తీసుకొచ్చిన వారికి రూ.10 వేల బహుమానం ఇస్తామంటూ మంచిర్యాల జిల్లాలోని ప్రధాన కూడళ్లలో పోస్టర్లు అతికించారు పర్వేజ్ కుటుంబ సభ్యులు.
పిల్లలు కనిపించకపోతే ఎంత ఆందోళన చెందుతారో ఈ మధ్య పెంపుడు జంతువులు కనిపించకపోయినా అంతే ఆందోళన చెందుతున్నారు జనం. పెంపుడు జంతువులనే కొందరు తమ పిల్లలుగా బావించడం అవి ఇలా మిస్స్ అయితే బెంగ పెట్టుకుని అనారోగ్యం పాలవడం కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. ఫ్లిప్పి ఘటన తెలిసిన వారంతా అయ్యో పాపం ఆ పిల్లి క్షేమంగా పర్వేజ్ కుటుంబం చెంతకు చేరితే బాగుండు అనుకుంటున్నారు. కొందరైతే ఫ్లిప్పి కోసం సర్చింగ్ కూడా మొదలెట్టారు కూడా. పది వేల రివార్డ్ కోసం మాత్రమే కాకుండా, కటుంబ సభ్యుల ఆవేదనను చూసైనా పిల్లిని పట్టిస్తే బాగుంటుంది అని పలువురు భావిస్తున్నారు. మరి తప్పిపోయిన ఆ పిల్లి దొరకాలని మనమూ కోరుకుందాం.