Viral Video: పోయేకాలం దగ్గరపడ్డదనుకుంటా.. ఒళ్లుగగుర్పొడిచే వీడియోను షేర్ చేసిన సజ్జనార్..ముఖ్యంగా సోషల్ మీడియాలో వింత పోస్ట్‌లు పెట్టడం, లేకపోతే ఏదో ఒక రిస్క్ చేసి దాన్ని అప్లోడ్ చేసి లైక్‌లు, కామెంట్ల కోసం పాకులాడటం మనం చూస్తూనే ఉన్నాం.. రీల్స్ కోసం పాకులాడి కొందరు ప్రాణాలు పొగొట్టుకున్నా.. మరికొందరు మాత్రం ఇదే ధొరణిని అవలంభిస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ ట్రెండ్ ప్రస్తుత కాలంలో ఒక రోగంగా మారింది.Man Stunt Viral Video: సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో వింత పోకడలు మరింత పెరిగాయి. అందరినీ ఆకట్టుకోవాలి.. ఫేమస్ కావాలనే ఉద్దేశంతో కొందరు చేసే పనులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వింత పోస్ట్‌లు పెట్టడం, లేకపోతే ఏదో ఒక రిస్క్ చేసి దాన్ని అప్లోడ్ చేసి లైక్‌లు, కామెంట్ల కోసం పాకులాడటం మనం చూస్తూనే ఉన్నాం.. రీల్స్ కోసం పాకులాడి కొందరు ప్రాణాలు పొగొట్టుకున్నా.. మరికొందరు మాత్రం ఇదే ధొరణిని అవలంభిస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ ట్రెండ్ ప్రస్తుత కాలంలో ఒక రోగంగా మారింది. అయితే, తాజాగా.. ఓ యువకుడికి ఈ పిచ్చి మరింత ముదిరింది. ఫేమస్ అవ్వాలనుకుని రైలు పట్టాలపై పడుకున్నాడు.. సోషల్ మీడియాలో రీల్ కోసం భ యువకుడు రన్నింగ్ ట్రైన్ కింద పడుకున్నాడు.. ట్రైన్ వెళ్లి పోయిన తర్వాత.. ఏదో సాధించినట్లు హీరోలా ఎగిరిగంతులు వేశాడు.. కొంచెం అటు ఇటయినా.. ప్రాణం పోయేది.. ఇలాంటి వద్దని వారిస్తున్నప్పటికీ.. చాలా మంది ఇదే ధోరణిని అవలంభిస్తుండటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియోను ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ షేర్ చేసి యువతకు పలు సూచనలు చేశారు.సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం పిచ్చిపనులు చేయొద్దంటూ సజ్జనార్ హితవు పలికారు. రైల్వే ట్రాక్ పై రన్నింగ్ ట్రైన్ కింద పడుకుని రీల్స్ చేసిన యువకుడి వీడియోను సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘‘సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పేమస్ కోసం సాహసాలు చేస్తే.. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాల మీదికి వస్తుంది. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!?’’ అంటూ సజ్జనార్ ట్విట్టర్ లో రాశారు. అలాంటి వారందరికీ సజ్జనార్ పోస్ట్ ఒక కనువిప్పు లాంటిది. ముఖ్యంగా యువతలో సజ్జానార్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.. సజ్జనార్ చేసిన మెసేజ్‌తో అయినా.. అలాంటి వారు మారాలని ఆశిద్దాం..
ఈ వీడియోలో ఒక యువకుడు రీల్స్ కోసం ట్రైన్ వచ్చే సమయంలో పట్టాలపై పడుకుంటాడు.. ట్రైన్ స్పీడుతో వెళ్తోంది. ట్రైన్ వెళ్లే వరకు అతను అక్కడే ఉంటాడు. చివరకు ట్రైన్ వెళ్లిన తర్వాత ఎగిరి గంతులేస్తాడు. అయితే, ఈ వీడియో చూసిన వారికి ఈ యువకుడి ప్రాణం ఉంటుందా..? పోతుందా..? అన్న భయం కలుగుతుంది.