మీ కరువు పాడుగాను.. చోరీకి వచ్చిన దొంగలు వాటిని మాత్రమే ఎత్తుకెళ్లారు.. అవేంటో తెలిస్తే నవ్వుకుంటారు..!Nirmal News: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం శాంతి నగర్లో దొంగల భీభత్సం సృష్టించారు. మూడు ఇళ్లలో వరుస చోరీలకి దిగిన దొంగలు.. మిట్టపల్లి ప్రవీణ్ అనే ఎన్ఆర్ఐ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారి. ప్రవీణ్ ఇంట్లో బంగారం, నగదు లేకపోవడంతో అంతకు మించిన విలువైన మూడు పారెన్ (అమెరికా) ఫుల్ బాటిల్స్ ను ఎత్తుకెళ్లారు. పోలీసులకు బాదితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.నిర్మల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో చోరికి తెగబడ్డ దొంగలు అత్యంత విలువైన సరుకు ఎత్తుకెళ్లారు. అవి కనిపించడమే ఆలస్యం వెంటనే కాజేసి చెక్కేశారు. ఇంతకీ ఏంటా సరుకంటారా.. మత్తులో చిత్తుచేసే సరుకు. అలాంటి ఇలాంటి లోకల్ సరుకు కాదు. అమెరికా సరుకు కావడంతో పండగ చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఆ మద్యం చోరీ స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం శాంతి నగర్లో దొంగల భీభత్సం సృష్టించారు. మూడు ఇళ్లలో వరుస చోరీలకి దిగిన దొంగలు.. మిట్టపల్లి ప్రవీణ్ అనే ఎన్ఆర్ఐ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారి. ప్రవీణ్ ఇంట్లో బంగారం, నగదు లేకపోవడంతో అంతకు మించిన విలువైన మూడు పారెన్ (అమెరికా) ఫుల్ బాటిల్స్ ను ఎత్తుకెళ్లారు. పోలీసులకు బాదితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ప్రవీణ్ ఈ మద్యే అమెరికా నుండి స్వగ్రామానికి వచ్చాడు. నాలుగు రోజుల క్రితం తల్లిని తీసుకుని తిరిగి అమెరికాకు వెళ్లి పోయాడు. అయితే అమెరికా నుండి వచ్చిన సమయంలో 6 పారెన్ మందు బాటిల్లు తీసుకొచ్చాడు. అందులో మూడు స్నేహితులకు ఇవ్వగా మరో మూడు ఇంట్లో ఉంచాడు. తాజాగా నిన్న రాత్రి ప్రవీణ్ ఇంట్లో పడ్డ దొంగలు ఆ మూడు బాటిల్లను ఎత్తికెళ్లినట్టు గుర్తించారు పోలీసులు.