Uday Kiran: ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఏం చేస్తున్నారో..? ఎక్కడున్నారో తెలుసా..?ఒకప్పుడు స్టార్ హీరోలు అవుతారు అనుకున్న వారు ఊహించని ఫ్లాప్ లతో కనిపించకుండా పోయారు. కథల ఎంపికలో తప్పటడుగు వేయడంలోనో.. లేక మరో కారణంతోనో చాలా మంది హీరోల సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అలాంటి హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. 2000 సంవత్సరంలో వచ్చిన చిత్రం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఉదయ్ కిరణ్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఉదయ్ కిరణ్. ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకుంటారు. మరి కొంతమంది క్రమక్రమంగా హీరోలుగా ఎదుగుతారు . ఎవరు ఎలా క్రేజ్ తెచుకున్నప్పటికీ ఆ స్టార్ డమ్ ను కంటిన్యూ చేయకపోతే ప్రేక్షకులు ఇట్టే మర్చిపోతారు. ఒకప్పుడు స్టార్ హీరోలు అవుతారు అనుకున్న వారు ఊహించని ఫ్లాప్ లతో కనిపించకుండా పోయారు. కథల ఎంపికలో తప్పటడుగు వేయడంలోనో.. లేక మరో కారణంతోనో చాలా మంది హీరోల సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అలాంటి హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. 2000 సంవత్సరంలో వచ్చిన చిత్రం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఉదయ్ కిరణ్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఉదయ్ కిరణ్.
చిత్రం సినిమా తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని, శ్రీరామ్, హోలీ, నీ స్నేహం లాంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు ఉదయ్ కిరణ్. ఆతర్వాత ఉదయ్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. వరుసగా ఫ్లాప్స్ రావడంతో ఆయన డైలమాలో పడ్డారు. పోయి అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టాడు ఉదయ్ కిరణ్.అయితే వరుస ఫ్లాప్ లు పలకరించడమతొ ఉదయ్ కిరణ్ కెరీర్ డల్ అయ్యింది. మెల్లగా ఆయనకు అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ విషిత ను వివాహం చేసుకున్నాడు. అవకాశాలు తగ్గడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఉదయ్. భార్య జాబ్ చేస్తుండటంతో ఆయన ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది. చివరకు ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొని కన్నుమూశారు. ఆయన మరణంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే ఉదయ్ కిరణ్ భార్య విషిత ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారాని కొందరు నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. విషిత ఇప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంది. ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆమె మరో వివాహం చేసుకోలేదు. జాబ్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు విషిత