Nayanthara: నయనతార బ్యూటీ సీక్రెట్ ఇదేనట.. రోజూ ఆ పనులు తప్పనిసరిగా చేస్తుందటహీరోలకు సరిసమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ రాణిస్తుంది నయన్. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. గతేడాది డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న నయన్..సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసి దూసుకుపోతున్నారు హీరోయిన్ నయనతార. ప్రస్తుతం ఉన్న అగ్రహీరోయిన్లలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ నయన్ అనే చెప్పాలి. హీరోలకు సరిసమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ రాణిస్తుంది నయన్. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. గతేడాది డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న నయన్.. అదే ఏడాది సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. అయితే పెళ్లి తర్వాత నయన్ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు.వయసు పెరుగుతున్నా కొద్దీ నయన్ చాలా అందంగా కనిపిస్తున్నారు. కెరీర్ బిగినింగ్ లో కంటే నయన్ ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తున్నారు. పెళ్ళై, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా నయన్ ఏమాత్రం వన్నె తగ్గకుండా గ్లామర్ తో కట్టిపడేస్తుంది ఈ చిన్నది.
తాజాగా తన బ్యూటీ సీక్రెట్ బయట పెట్టింది నయన్. ఇక ఈ లేడీ సూపర్ స్టార్ గ్లామర్ కు సీక్రెట్ మంచినీళ్లు అంట. నేను ఎక్కువగా మంచి నీళ్లు ఎక్కువగా తాగుతాను .. మంచినీళ్ల ను మించిన ఔషధం లేదనేది నా అభిప్రాయం అని అంటున్నారు నయనతార. రోజుకు 8 గంటల పాటు కచ్చితంగా నిద్రపోతాను,ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకుంటాను, అనవసరమైన ఆలోచనలు మైండ్ లోకి రానివ్వను అలాగే జిమ్, యోగ తప్పని సరిగా చేస్తాను ఇవే నా బ్యూటీ సీక్రెట్ అంటుంది నయన్.