Andhra Pradesh: పుట్టింటికెళ్లిన భార్య తిరిగి రాలేదని భర్త మనస్థాపం.. నాటు తుపాకీతో.బాపట్లజిల్లా చిన్నగంజాం మండలం మోటుపల్లిలో నాటు తుపాకీతో కాల్చుకొని తమిళనాడుకు చెందిన అలెక్స్ పాండ్యన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మోటుపల్లిలో రొయ్యలచెరువుకు పాండ్యన్ కాపలాదారుగా ఉన్నాడు. తన ఇద్దరు భార్యలతో కలిసి గత కొంతకాలంగా రొయ్యల చెరువుకు వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు మండలం ఆంబ్రోమ్ పేటకు చెందిన అలెక్స్ పాండ్యన్ (26) తన ఇద్దరు భార్యలు తులసి, రమ్యలతో కలిసి మోటుపల్లి రొయ్యల చెరువు దగ్గర కాపలా ఉంటున్నాడు.,,చిన్ని చిన్న విషయాలకు కూడా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు కొందరు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోక ప్రాణాలు తీయడమో, తమ ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నారు. విచక్షణ కోల్పోయి పుట్టెడు దుఃఖాన్ని మిగిలిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చిన్న గంజాం మండలంలోని మోటుపల్లిలో జరిగింది. పుట్టింటికెళ్లిన భార్య తిరిగి రాలేదున్న కారణంతో భర్త తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు…బాపట్లజిల్లా చిన్నగంజాం మండలం మోటుపల్లిలో నాటు తుపాకీతో కాల్చుకొని తమిళనాడుకు చెందిన అలెక్స్ పాండ్యన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మోటుపల్లిలో రొయ్యలచెరువుకు పాండ్యన్ కాపలాదారుగా ఉన్నాడు. తన ఇద్దరు భార్యలతో కలిసి గత కొంతకాలంగా రొయ్యల చెరువుకు వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు మండలం ఆంబ్రోమ్ పేటకు చెందిన అలెక్స్ పాండ్యన్ (26) తన ఇద్దరు భార్యలు తులసి, రమ్యలతో కలిసి మోటుపల్లి రొయ్యల చెరువు దగ్గర కాపలా ఉంటున్నాడు.
తన నాటు తుపాకితో పక్షులను తరిమి వేస్తూ కాపలా కాస్తున్నాడు. చిన్న భార్య రమ్యకు ఐదు సంవత్సరాల కావ్య అనే కూతురు ఉంది. పాండ్యన్ ఇద్దరు భార్యలకు ఇటీవల కాలంలో మనస్పర్ధలు వచ్చాయి. దీంతో పెద్ద భార్య తులసి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పెద్దభార్య తిరిగి రాకపోవడంతో పాండ్యన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన దగ్గర ఉన్న నాటు తుపాకితో తలకు కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో పాండ్యన్ తల ఛిద్రమైంది. సమాచారం అందుకున్న చిన్నగంజాం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పాండ్యన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నగంజాం యస్ఐ సురేష్ తెలిపారు.