Samantha Ruth Prabhu: జిమ్‌లో జిగేలుమన్న సామ్.. పిల్లితో ఆటలాడుతూ ఇలా..ప్రస్తుతం చేస్తున్న ఖుషి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాలకు టాటా చెప్పారు సామ్. ఓ లాంగ్ గ్యాప్ తీసుకొని ఆరోగ్యం పైన జీవితం పైన దృష్టి పెట్టాలనుకుంటున్నా.. అని అనౌన్స్ చేసింది సామ్. అలా అనౌన్స్ చేసిన వెంటనే లగేజ్ దర్దుకొని విమానమెక్కేసింది. కావాల్సినంత టైం దొరకడంతో లైఫ్‌ను మరో యాంగిల్ నుంచి చూస్తుంది. నిన్న మొన్నటి వరకు లైట్స్, కెమెరా , యాక్షన్ అనే సౌండ్స్ మధ్య గడిపిన సామ్. ఇప్పుడు ప్రకృతిని ఆస్వాదిస్తూ.. పచ్చిక బైళ్ళలో పరుగులు పెడుతోంది.సమంత ఫ్యాన్స్‌లో నిరాశలో నిండిపోయింది.. సినిమాలకు గ్యాప్ ఇస్తున్నా అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అమ్మడి అభిమానులంతా డల్ అయిపోయారు డీలాపడ్డారు. ప్రస్తుతం చేస్తున్న ఖుషి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాలకు టాటా చెప్పారు సామ్. ఓ లాంగ్ గ్యాప్ తీసుకొని ఆరోగ్యం పైన జీవితం పైన దృష్టి పెట్టాలనుకుంటున్నా.. అని అనౌన్స్ చేసింది సామ్. అలా అనౌన్స్ చేసిన వెంటనే లగేజ్ దర్దుకొని విమానమెక్కేసింది. కావాల్సినంత టైం దొరకడంతో లైఫ్‌ను మరో యాంగిల్ నుంచి చూస్తుంది. నిన్న మొన్నటి వరకు లైట్స్, కెమెరా , యాక్షన్ అనే సౌండ్స్ మధ్య గడిపిన సామ్. ఇప్పుడు ప్రకృతిని ఆస్వాదిస్తూ.. పచ్చిక బైళ్ళలో పరుగులు పెడుతోంది. ఆటో ఇమ్యూనిటీ బిల్డ్ కోసం సామ్ బాలిలోవెళ్ళింది. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సామ్ సోషల్ మీడియాలో మాత్రం గ్యాప్ లేకుండా గడిపేస్తుంది. తాను చేసే ప్రతి పనిని అభిమానులతో పంచుకుంటూనే ఉంది.ఎక్కడ ఉన్నా.. ఏం చేసిన తన అభిమానులతో పంచుకుంటూ ఫ్యాన్స్‌లో ఆనందాన్ని నింపుతుంది. ఈ మద్యే బాలి లో కోతులతో ఫోటోలు దిగి షేర్ చేసింది సామ్. అలాగే తన స్నేహితులతో కలిసి ప్రకృతిలో ఓ పక్షిలా విహరిస్తూ ఎంజాయ్ చేసింది. ఆ ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేయగా.. అవి చూసి సామ్ ఫ్యాన్స్ ..ఇదే కదా నీ నుంచి మేము కోరుకునేది. నువ్వు ఇలా ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మరో ఫోటో వైరల్ అవుతుంది. సామ్ మాయోసైటిస్కు చికిత్స తీసుకొని ఇండియాకు తిరిగి వచ్చింది. వచ్చిన వెంటనే జిమ్‌లో కసరత్తులు కూడా మొదలు పెట్టేసింది. జిమ్‌లో తన పిల్లితో అదలాడుతూ కనిపించింది సామ్. తన పెంపుడు పిల్లి గెలాటో తో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామ్ లేటెస్ట్ ఫోటోల పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ అమ్మడు నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది.