New Smartphones: ఈ జూలైలో మార్కెట్‌ని షేక్ చేసిన స్మార్ట్ ఫోన్లు ఇవే.. గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్..ఈ జూలై నెలలో స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో కొన్ని ఫోన్లు సెన్సేషన్ సృష్టించాయి. ప్రీమియం మోడళ్లుగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి అల్టిమేట్ ఫీచర్లు, సూపర్ డిజైన్, అదరగొట్టే స్పెసిఫికేషన్లతో ఆకట్టుకున్నాయి. కొన్ని ప్రముఖమైన బ్రాండ్ల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది.2023వ సంవత్సరంలో మరో నెల గడిచిపోయంది. ఆగస్టు నెల ప్రారంభం కాబోతోంది. అయితే ఈ జూలై నెలలో స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో కొన్ని ఫోన్లు సెన్సేషన్ సృష్టించాయి. ప్రీమియం మోడళ్లుగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి అల్టిమేట్ ఫీచర్లు, సూపర్ డిజైన్, అదరగొట్టే స్పెసిఫికేషన్లతో ఆకట్టుకున్నాయి. కొన్ని ప్రముఖమైన బ్రాండ్ల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. అత్యాధునిక ఫోల్డబుల్ ఫోన్ల నుంచి ఫుల్ ఫీచర్ ప్యాక్డ్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో టాప్ లాంచ్ ల గురించి మనం తెసుకుందాం..గ్లోబల్ సెన్సేషన్.. నథింగ్ ఫోన్(2)..
జూలైలో నథింగ్ ఫోన్ (2) గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. మన దేశంతో పాటు యునైటెడ్ స్టేట్స్లో దాని అరంగేట్రం చేసింది. నథింగ్ కంపెనీ నుంచి వస్తున్న రెండో మోడల్ స్మార్ట్ ఫోన్ ఇది. ఇది స్నాప్‌డ్రాగన్ 8+ జెన్1 ఫ్లాగ్షిప్ చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. 4,700ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 45వాట్ల సామర్థ్యంతో ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దాని సిగ్నేచర్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ని నిలుపుకుంటూ, ఫోన్ ఇప్పుడు అదనపు లైటింగ్ జోన్లతో ప్రత్యేక ఆకర్షణను జోడించింది. 6.7-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ 120హెర్జ్ డిస్ప్లే తో ఈ ఫోన్ వస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జెడ్ ఫ్లిక్ 5..
సియోల్‌లో జరి శామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో ఈ శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జెడ్ ఫ్లిక్ 5 ఫోల్డబుల్ ఫోన్లను ఆవిష్కరించింది. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ఫోన్ గేమ్ చేంజర్ గా బరిలోకి దిగింది. ఇది నో-గ్యాప్ హింజ్ డిజైన్‌ను ప్రదర్శించి, 6.2-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ కవర్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది అద్భుతమైన 7.6-అంగుళాల క్యూఎక్స్ జీఏ ప్లస్ డిస్ప్లే తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8జెన్ 2 ప్రాసెర్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది మెరుగైన 10ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. విశేషమైన ఫీల్డ్-ఆఫ్-వ్యూ, ఎపర్చరును అందిస్తుంది.అదే విధంగా గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ముందు వైపు 3.4-అంగుళాల సూపర్ అమోల్డ్ కవర్ డిస్ప్లేతో వస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత 6.7-అంగుళాల ఫుల్ హెచ్ డప్ల్ 120హెర్జ్ అమోల్డ్ స్క్రీన్ ను కలిగి ఉంది. రెండు స్మార్ట్ఫోన్లు ఐపీఎక్స్8 రేటింగ్, 12ఎంపీ ప్రధాన కెమెరాలు ఉంటాయి. బ్లేజింగ్-ఫాస్ట్ 25వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిచ్చాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ఫోన్ 4,400ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోన్లో 3,700ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేసింది.
మోటోరోలా రాజ్ఆర్ 40 సిరీస్..
మోటరోలా తన సొగసైన ఫ్లిప్ ఫోన్లు, రాజ్ఆర్ 40 రాజ్ఆర్ 40 అల్ట్రాలను ఆవిష్కరించింది. ఇవి 6.9-అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లేలను ప్రదర్శించాయి, రాజ్ఆర్ 40 అల్ట్రా 165హెర్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. రాజ్ఆర్ 40 అల్ట్రా 3.6-అంగుళాల 120హెర్జ్ పోలెడ్ కవర్ డిస్ప్లేతో వస్తుంది. రెండు మోడల్స్‌లో 32ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫ్లెక్స్ మోడ్ లాంటివి ఉన్నాయి. దీనిలో 4,200ఎంఏహెచ్ బ్యాటరీతో, రాజ్ఆర్ 40 ఫోన్ వస్తుంది. అలాగే రాజ్ఆర్ 40 అల్ట్రా 3,800ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రెండూ వైర్లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి.
అధిక పెర్పార్మెన్స్ కోసం ఒప్పో రెనో 10 సిరీస్..
ఒప్పో రెనో 10 సిరీస్ లో మూడు ఆకర్షణీయమైన మోడళ్లను పరిచయం చేసింది. రెనో 10, రెనో 10 ప్రో రెనో 10 ప్రో ప్లస్ పేరుతో లాంచ్ అయ్యాయి. దీనిలో రెనో 10 ప్రో ప్లస్ ఫోన్ ఓఐఎస్ తో పాటు 64ఎంపీ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌తో వస్తుంది. దీనిలో 4,700ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 100వాట్ల సామర్థ్యంతో ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఇస్తుంది. సెల్ఫీల కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వినియోగదారులను ఆశ్చర్యపరిచింది.రెనో 10 ప్రో లో స్నాప్‌డ్రాగన్ 778జీ చిప్సెట్ ఆధారంగా పనిచేస్తోంది. 80వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉంటుంది. 50ఎంపీ ప్రధాన కెమెరాత ఉంటుంది. 4,600ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. బేస్ మోడల్ ఒప్పో రెనో 10లో మీడియా టెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ని తో వస్తుంది. దీనిలో 64ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉంటుంది.