Telangana: ఇదేం పాడుబుద్ధి.. మహిళా అధికారిపై సీఐడీ ఎస్పీ లైంగిక వేధింపులు.. కేసు నమోదుకొత్త పేట పరిధిలోని చైతన్యపురి కి చెందిన TSSPDCL సీనియర్ అసిస్టెంట్ అనురాధ ను సిఐడి ఎస్పీ కిషన్ సింగ్ వేధింపులకు గురిచేశాడు. 2020–21 సంవత్సరంలో సరూర్ నగర్ స్టేడియం లో నేషనల్ కాంపిటీషన్స్ కు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగిని పై తాను డీఎస్పీ గా ఉన్న సమయం టైం లో కన్నేసాడు కిషన్ సింగ్.అతనొక ఎస్పీ.. సీఐడీ విభాగం లో హోదా. అయినా తన చిల్లర బుద్దిని ఆపుకొలేదు. సాయం చేస్తా అని ఒక మహిళకు సైట్ కొట్టే ప్రయత్నం చేశాడు. పలు మార్లు హెచ్చరించిన మహిళ ఓపిక నశించి పోలీస్ లను ఆశ్రయించింది. విషయం బయటకి తెలిసి జనం చీకొడితే పోలీస్ బాస్ ఆ సిగ్గుమాలిన పనికి తల దించుకున్నాడు. అసలు ఎవరా ఎస్పీ? బాధితురాలిని ఎలా వేధించాడు. కొత్త పేట పరిధిలోని చైతన్యపురి కి చెందిన TSSPDCL సీనియర్ అసిస్టెంట్ అనురాధ ను సిఐడి ఎస్పీ కిషన్ సింగ్ వేధింపులకు గురిచేశాడు. 2020–21 సంవత్సరంలో సరూర్ నగర్ స్టేడియం లో నేషనల్ కాంపిటీషన్స్ కు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగిని పై తాను డీఎస్పీ గా ఉన్న సమయం టైం లో కన్నేసాడు కిషన్ సింగ్. భర్త చనిపోయి అనురాధ ఒంటరిగా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకుని లొంగ తీసుకోవాలని దొంగ బుద్ధి చూపించాడు. తాను స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్న వాటిలో పాల్గొనాలని అంటూ అనురాధ ఫోన్ నంబర్ తీసుకున్నాడు. అప్పటి నుంచి లైంగికంగా వేదించటం మొదలు పెట్టాడు కిషన్ సింగ్.తరచూ అనురాధ కు అభ్యంతరకర మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలు పంపేవాడు. రొమాంటిక్ హిందీ సాంగ్స్‌ను అనురాధకు పంపించి విని దానిమీద అభిప్రాయం చెప్పమని కోరేవాడు. అంతేకాకుండా యూట్యూబ్ నుంచి సారీ కట్టుకునే వీడియోలను పంపించి ఫోన్ చేసి ఆ వీడియోల గురించి డిస్కస్ చేసేవాడు. తనను కలిసేందుకు వచ్చేటప్పుడు సారీ కట్టుకొని రావాలని బలవంతం చేసేవాడు.నీ ఫోటోలు పంపు అంటూ తరచూ వేదింపులు గురిచేస్తూ ఉండే వాడు. కొన్ని రోజులు నచ్చచెప్పే ప్రయత్నం చేసిన అనురాధ కిషన్ సింగ్ తో మాట్లాడటం మానేసి దూరంగా ఉండాలి. ఒక కేసు విషయంలో అనుకోకుండా కిషన్ సింగ్ తో అనురాధ మాట్లాడాల్సి వచ్చింది. ఇది అదునుగా వేధింపులను తీవ్రం చేశాడు కిషన్ సింగ్ తనకు అనుకూలంగా వ్యవహరించి తన కోరికలను తీరిస్తే సహాయం చేస్తానని ఇబ్బంది పెట్టే వాడు. ఈసారి కిషన్ సింగ్ వేధింపులను తట్టుకోలేక పోయిన అనురాధ పోలీసులను ఆశ్రయించింది.దీంతో సీఐడి ఎస్పీ కిషన్ సింగ్ అంశాన్ని చైతన్య పూరి పోలీస్ లు పై అధికారులకి వివరించారు. వెంట నే కేస్ నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. నిన్ననే తెలంగాణ ఉమెన్ సేఫ్టీవింగ్ అధిపతి అడిషనల్ డీజీ సికగోయల్ ఒక నివేదికను విడుదల చేసి మహిళల భద్రత రక్షణ విషయంలో దేశంలోనే మనం ముందంజలో ఉన్నాం అన్న 24 గంటల్లోనే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న తీరు బయటకు రావడం సిగ్గు చేటైన విషయం.