Congress mp uttam kumar reddy to gave clarity on rumours about party changing Telugu News
Uttam Kumar Reddy: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి..ఓ కాంగ్రెస్ నేతతో సంబంధం ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా సంస్థలు ఈ తరహా దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయంటూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. అయితే, మరికాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నట్టుగా తెలిసింది.కాంగ్రెస్ వీడి భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారని వస్తున్న సోషల్ మీడియా కథనాలను ఖండించారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్న ఓ నేత ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమంటూ పత్రిక ప్రకటన విడుదల చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 30 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. తమ పిల్లలు లేరు. 365 రోజులు 24 గంటలు ప్రజా జీవితంలోనే ఉంటున్నామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా తమ ఇద్దరిపై ఈ తరహా సోషల్ మీడియా దాడి జరుగుతుందని వాపోయారు. ఓ కాంగ్రెస్ నేతతో సంబంధం ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా సంస్థలు ఈ తరహా దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయంటూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు.