Chiranjeevi: మెగాస్టార్ కోసం ఆ హీరో రెండు సినిమాలు వదులుకున్నారట..
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా ఎదిగి.. మెగాస్టార్ గా ప్రేక్షకుల చేత జే జే లు కొట్టించుకున్నారు చిరంజీవి. చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఏది అంటే టక్కున చెప్పే పేరు ఖైదీ. ఈ సినిమాతో మెగాస్టార్ దశ తిరిగింది. ఖైదీ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించి చిరుజీవికి మంచి పేరు తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి పేరే వినిపిస్తుంది. కానీ ఆయన దాన్ని ఒప్పుకోరు. నటుడిగా ఉండేందుకే ఇష్టపడతాను.. నేను పెద్ద దిక్కుగా ఉండను అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు చిరంజీవి. అంత స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు మెగాస్టార్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా ఎదిగి.. మెగాస్టార్ గా ప్రేక్షకుల చేత జే జే లు కొట్టించుకున్నారు చిరంజీవి. చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఏది అంటే టక్కున చెప్పే పేరు ఖైదీ. ఈ సినిమాతో మెగాస్టార్ దశ తిరిగింది. ఖైదీ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించి చిరుజీవికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఖైదీ సినిమా ముందుగా ఓ స్టార్ హీరో చేయాల్సిందట. చిరంజీవి కోసం ఆ సినిమాను వదులుకున్నాడట ఆ స్టార్ హీరో..
ఇంతకు ఆ హీరో ఎవరో కాదు.. సూపర్ స్టార్ కృష్ణ. చిరంజీవికి సూపర్ స్టార్ కృష్ణకు మధ్య మంచి బాండింగ్ ఉండేది. అప్పట్లో చిరంజీవి అప్ కమింగ్ హీరో ఆ టైం లోనే కృష్ణ చిరంజీవితో కలిసి మల్టీస్టారర్ మూవీ చేశారు. ఈ ఇద్దరితో కలిసి నటించిన తోడు దొంగలు సినిమా పెద్ద హిట్ అయ్యింది.
ఆ తర్వాత ఖైదీ సినిమా కథ ముందు కృష్ణ దగ్గరకు వచ్చిందట. అయితే ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ సినిమాకు చిరంజీవిని సూచించారట. ఖాదీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే పసివాడు ప్రాణం సినిమాను కూడా కృష్ణ వదులుకొని చిరంజీవి అయితే బాగుంటుందని సూచించారట. ఈ ఇద్దరు స్టార్ హీరోల మద్య బాండింగ్ అంతలా ఉండేది. ఇక అప్పట్లో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కి చిరంజీవి ప్రెసిడెంట్ ఉండేవారట.