YCP vs TDP: కుప్పంలో అప్పుడే పొలిటికల్ హీట్.. నియోజకవర్గంలో ఊపందుకున్న నేతల పర్యటనలులక్ష ఓట్ల మెజారిటీ. ఇది టిడిపి టార్గెట్. వైనాట్ 175 లక్ష్యం వైసీపీ టార్గెట్. ఇలా చిత్తూరు జిల్లా కుప్పంలో ఎవరి టార్గెట్ వారిదే. రెండు పార్టీల మధ్య స్టేట్ లో పొలిటికల్ ఫైట్ ఎలా ఉన్నా కుప్పంలో మాత్రం ఇంట్రెస్టింగ్ ఫైట్ కొనసాగుతోందిలక్ష ఓట్ల మెజారిటీ . ఇది టిడిపి టార్గెట్. వైనాట్ 175 లక్ష్యం వైసీపీ టార్గెట్. ఇలా చిత్తూరు జిల్లా కుప్పంలో ఎవరి టార్గెట్ వారిదే. రెండు పార్టీల మధ్య స్టేట్ లో పొలిటికల్ ఫైట్ ఎలా ఉన్నా కుప్పంలో మాత్రం ఇంట్రెస్టింగ్ ఫైట్ కొనసాగుతోంది. రాజకీయ పరిస్థితి రోజు రోజుకు ఎత్తులకు పై ఎత్తులతో సాగుతోంది. ఒక వైపు మంత్రి పెద్దిరెడ్డి మరోవైపు చంద్రబాబులే వ్యూహాకర్తలుగా వ్యవహరి స్తుండటంతో 2024 ఎన్నికల సంగ్రామానికి కుప్పం సిద్దమైంది. ఏపీ శాసనసభలో ఉన్న 175వ నియోజకవర్గాల్లో కుప్పంది ప్రత్యేక స్థానం. ఇంకా చెప్పాలంటే టిడిపి అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ. వరుసగా 7వసారి టిడిపి జెండా ఇక్కడ విజయ కేతనం ఎగుర వేస్తోంది. చంద్రబాబు టిడిపి అభ్యర్థిగా ఇక్కడి నుంచే ఎన్నికవుతూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు వైనాట్ 175 అంటున్న వైసీపీ వ్యూహం కుప్పం లో రాజకీయంగా కాకరేపుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి కుప్పంలో రాజకీయ పరిస్థితులు మారిపోతూనే వస్తున్నాయి. రాజకీయంగా చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న పెద్దిరెడ్డి చంద్రబాబుల రాజకీయ వైర్యానికి తోడు వైనాట్ 175 అంటున్న సీఎం జగన్ నినాదం ఇప్పుడు కుప్పం పాలిటిక్స్ ను మరింత రంజుగానే మార్చింది.పెద్దిరెడ్డి నేతృత్వంలో వైసీపీ దూకుడు..
కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పెద్దిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను సింగిల్ హ్యాండ్ తో స్వీప్ చేయడంతో టిడిపి ఖంగుతింది. దీంతో అప్రమత్తమైన టిడిపి హైకమాండ్ కుప్పంలో పట్టు జారిపోకుండా ప్రయత్నాలు చేపట్టింది. స్థానిక నాయకత్వంలో మార్పులు చేయడంతో పాటు నేరుగా చంద్రబాబే రంగంలోకి 3 నెలలకోసారి కుప్పంకు వచ్చి ఇంటిని చక్కబట్టే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. సొంత ఇంటిని కట్టుకునే ప్రయత్నం చేయడంతో పాటు నాయకత్వంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు అధికార పార్టీ వ్యూహాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేయల్సి వచ్చింది. టిడిపికి కుప్పం గుండెకాయ లాంటిదని చెప్పే ప్రయత్నం చేసిన చంద్రబాబు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను కుప్పం లోనే మకాం పెట్టించి పార్టీ బాధ్యతలను అప్పగించాల్సి వచ్చింది. లక్ష ఓట్ల మెజారిటీ క్యాంపెయిన్ బాధ్యతను అప్ప చెపుతూ గత నెలలో 3 రోజుల పాటు బూత్ లెవెల్ నుంచి నియోజకవర్గం వరకు క్యాడర్ కు బ్రెయిన్ వాష్ చేసి దిశా నిర్దేశం చేసిన బాబు పక్కా ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు.
దొంగనోట్ల వ్యవహారంతో..
ఇక చంద్రబాబు దూకుడుకు బ్రేకు లేసేందుకు వైసీపీ అభివృద్ధి, సంక్షేమం పేరుతో కుప్పంలో బలపడేందుకు ప్రయత్నం చేస్తొంది. మంత్రి పెద్దిరెడ్డి రంగంలోకి దిగి కుప్పం నియోజకవర్గంలో కలియ తిరుగుతూ మారుమూల గ్రామాలను టచ్ చేసారు. పల్లెబాట పేరుతో ప్రజలను పలకరించారు. 35 ఏళ్లు ఎమ్మెల్యే గా చంద్రబాబు వెళ్లని గ్రామాలకు కూడా వెళ్లిన పెద్దిరెడ్డి జనంతో అర్జీలను తీసుకుంటూ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేసి కుప్పంలో రాజకీయ చర్చకు తెర లేపారు. సీఎంగా ఎమ్మెల్యేగా చంద్రబాబు సమస్యలు పరిష్కరించ లేదు కాబట్టే జనం ఎన్నో సమస్యలను అర్జీల రూపంలో ఇస్తున్నారని పెద్దిరెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి వైసీపీని గెలిపించాలంటూ జనం ముందుకు వెళుతున్న పెద్దిరెడ్డి కచ్చితంగా చంద్రబాబు ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వైనాట్ 175 లో 2024 ఎన్నికల్లో కుప్పం వైసీపీ దేనన్న ధీమా పెద్దిరెడ్డిలో ఉంది. ఇలా టిడిపి దూకుడు, వైసీపీ ఎత్తులు కొనసాగుతుండగా మరోవైపు దొంగ ఓట్ల వ్యవహారం కూడా కుప్పంలో పొలిటికల్ గా కాక రేపుతోంది. రెండు పార్టీల మధ్య ఫిర్యాదులు, మాటలు యుద్దానికి కారణం కాగా ఎవరి వ్యూహాల్లో వారు ఎన్నికల సమరానికి సిద్దం అవుతున్న పరిస్థితి కుప్పంలో నెలకొంది. ఒక పార్టీ క్యాంపియన్ ముగిసిన వెంటనే మరో పార్టీ క్యాంపియన్ కు ప్లానింగ్ సిద్ధమవుతుండడంతో ఎన్నికలకు 9 నెలలు సమయం ఉండగానే కుప్పంలో వైసిపి టిడిపిల ప్రచార కార్యక్రమాలు ఊపందుకు న్నాయి. గత నెలలో 3 రోజుల చంద్రబాబు, ఆ వెంటనే 10 రోజులకు పైగా మంత్రి పెద్దిరెడ్డి, ఈ వారంలో నారా భువనేశ్వరి కుప్పం పర్యటన ఖరారు కావడంతో కుప్పంలో పొలిటికల్ హీట్ ను పెంచేస్తోంది. రెండు పార్టీలకు కుప్పం పోరు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది.