Bull Viral Video: పగబట్టిన ఎద్దు.. భయపడి చెట్టెక్కిన వ్యక్తి .. అక్కడే కాపు కాసిన ఎద్దు..బలియా జిల్లాలోని రస్డా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఎద్దు ఏం జరిగిందో తెలియదు కానీ, ఇప్పటి వరకు 12 మందిని గాయపర్చింది. ఈ సందర్భంలోనే జూలై 28న ఖఖ్నూ అనే రైతు వెంట పడింది. పగబట్టినట్టుగా అతన్ని తరుముతూనే ఉంది. దాని బారినుంచి తప్పించుకునేందుకు రైతు పరిగెడుతూ రోడ్డుపక్కనున్న చెట్టు ఎక్కేశాడు. అయినా ఆ ఎద్దు తగ్గలేదు. నిన్ను వదిలేదే లేదు అన్నట్టుగా అతను చెట్టు ఎప్పుడు దిగుతాడా అని అక్కడే కాపుకాసింది.సృష్టిలో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. పాములు పగబడతాయని అందరికీ తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు.. వివిధ రకాల జంతువులు కొన్ని సంఘటనల్లో పగబట్టినట్లు మనుషులను వెంటాడుతూనే ఉంటాయి. తాజాగా ఓ ఎద్దు కూడా వ్యక్తిని పగబట్టినట్లు వెంటాడుతోంది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఎద్దుకు భయపడి ఓ వ్యక్తి రెండు గంటలపాటు చెట్టుపైనే కూర్చుండిపోయాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.బలియా జిల్లాలోని రస్డా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఎద్దు ఏం జరిగిందో తెలియదు కానీ, ఇప్పటి వరకు 12 మందిని గాయపర్చింది. ఈ సందర్భంలోనే జూలై 28న ఖఖ్నూ అనే రైతు వెంట పడింది. పగబట్టినట్టుగా అతన్ని తరుముతూనే ఉంది. దాని బారినుంచి తప్పించుకునేందుకు రైతు పరిగెడుతూ రోడ్డుపక్కనున్న చెట్టు ఎక్కేశాడు. అయినా ఆ ఎద్దు తగ్గలేదు. నిన్ను వదిలేదే లేదు అన్నట్టుగా అతను చెట్టు ఎప్పుడు దిగుతాడా అని అక్కడే కాపుకాసింది. దీంతో ఆ ఖఖ్నూ రెండు గంటలపాటు చెట్టుపైనే గడపాల్సి వచ్చింది.
ఈ విచిత్ర ఘటనపై అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ఎద్దుల ఆగడాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు ఎద్దులను అదుపులో ఉంచేందుకు బుల్ ప్రొటెక్షన్ సెక్షన్ను ఏర్పాటు చేయాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఇలా దారితప్పిన 3,910 ఎద్దులను సంరక్షణ కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. మరోవైపు రైతును భయపెట్టిన ఎద్దును పట్టుకుని సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు ఇప్పటికే ఓ బృందం రంగంలోకి దిగింది.