Kshudra Poojalu: బాబోయ్ పున్నమి ఘడియల్లో భయంకర క్షుద్రపూజలు.. ఎవరి ఇంటిముందో తెలుసా..Vizianagaram District News: ఇళ్లలో నుండి బయటకు రావడానికే భయపడుతున్నారు. చిన్నారులు స్కూల్స్ మానేసి ఇంటికే పరిమితమయ్యారు. క్షుద్రపూజల కలకలం తో పూజల వల్ల జరిగే హానికి విరుగుడు కోసం పట్టణవాసులు పెద్ద ఎత్తున ఆలయాలకు వెళ్లి పూజలు ప్రత్యేక జరుపుతున్నారు. ఆలయాలు పోటెత్తుతున్నాయి.. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి స్థానికులను ఆరా తీశారు. అందుబాటులో ఉన్న సీసీ పుటేజ్ పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. పూజలు కారణంగా కీడు వాటిల్లుతుందని చుట్టుప్రక్కల ఇళ్లవారు కన్నీరు పెట్టుకుంటున్నారు.విజయనగరం, జూలై 31: ముగ్గు, పసుపు, కుంకుమ, కోడిగుడ్లు, ఎండుమిర్చి, నిమ్మకాయలు అన్ని కలగలిపి అర్థరాత్రి చేసిన భయంకర క్షుద్రపూజాలు ఆ ప్రాంతాన్ని భయానకంగా మార్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి చేసిన క్షుద్ర పూజలు విషయం తెలిసి భయంభయంగా బ్రతుకుతున్నారు. ఎవరి ప్రాణాలు తీయడానికి చేశారో, ఏ కీడు తలపెట్టడానికి ఈ పనికి పాల్పడ్డారో అని పట్టణమంతా బిక్కుబిక్కుమంటున్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోనే అమ్మవారి కాలనీ రెండో లైన్ లో జరిగిన ఈ క్షుద్రపూజలు పట్టణవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తెల్లవారుజామున నిద్ర లేచి ఇళ్లలో నుండి బయటకు వచ్చిన స్థానికులు క్షుద్ర పూజలను చూసి భయంతో ఇళ్లలోకి పరుగులు తీశారు. పౌర్ణమి గడియల్లో చేసిన క్షుద్ర పూజలకు పట్టు ఉంటుందని, పూజలు కారణంగా కీడు వాటిల్లుతుందని చుట్టుప్రక్కల ఇళ్లవారు కన్నీరు పెట్టుకుంటున్నారు.ఇళ్లలో నుండి బయటకు రావడానికే భయపడుతున్నారు. చిన్నారులు స్కూల్స్ మానేసి ఇంటికే పరిమితమయ్యారు. క్షుద్రపూజల కలకలం తో పూజల వల్ల జరిగే హానికి విరుగుడు కోసం పట్టణవాసులు పెద్ద ఎత్తున ఆలయాలకు వెళ్లి పూజలు ప్రత్యేక జరుపుతున్నారు. ఆలయాలు పోటెత్తుతున్నాయి.. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి స్థానికులను ఆరా తీశారు. అందుబాటులో ఉన్న సీసీ పుటేజ్ పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే క్షుద్రపూజలు బూటకమని ఎవరూ వాటిని నమొద్దు అంటున్నారు జన విజ్ఞాన వేదిక సభ్యులు. క్షుద్రపూజలకు విరుగుడు పేరిట ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అనవసరంగా డబ్బు వృధా చేసుకోవద్దని సూచిస్తున్నారు.