Beware of juice jacking, scammers now using public charging ports for stealing money, know how to protect from it
Juice Jacking: బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! మీ ఖాతా ఖాళీ అయిపోద్ది..ఇప్పటి వరకూ లింక్‌లు, మెసేజ్‌లు, మెయిళ్ల ద్వారా దందా సాగించిన ఈ సైబర్ ముఠాలు ఇప్పుడు మరో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అదే జ్యూస్ జాకింగ్. ఏంటి పదం కొత్తగా ఉందని ఆలోచిస్తున్నారా? దీని గురించి తెలుసుకుంటే ఒళ్లు గగుర్పాటు రావడం ఖాయం.టెక్నాలజీ ఎంత పెరుగుతుందో.. అంతే స్థాయిలో ప్రమాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు విరివిగా వాడుతున్న ప్రస్తుతం సమాజంలో వ్యక్తిగత డేటాతో పాటు, పలు బ్యాంకు అకౌంట్ల వివరాలు, క్రెడిట్ కార్డు పాస్వర్డ్లు వంటివి అన్ని ఫోన్లలో నిక్షిప్తం అయి ఉంటున్నాయి. సైబర్ నేరగాళ్లు దీనిని అదునుగా మార్చుకుంటున్నారు. ఏదో ఒకరకంగా సెల్‌ఫోన్ హ్యాక్ చేయగలిగితే చాలు. ఎంత డేటా కావాలంటే అంత డేటా అందులో లభిస్తోంది. అందులో భాగంగానే కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇప్పటి వరకూ లింక్‌లు, మెసేజ్‌లు, మెయిళ్ల ద్వారా దందా సాగించిన ఈ సైబర్ ముఠాలు ఇప్పుడు మరో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అదే జ్యూస్ జాకింగ్. ఏంటి పదం కొత్తగా ఉందని ఆలోచిస్తున్నారా? దీని గురించి తెలుసుకుంటే ఒళ్లు గగుర్పాటు రావడం ఖాయం. కేవలం ఫోన్ చార్జింగ్ పెట్టడం ద్వారా మీ ఫోన్లోని డేటా మొత్తాన్ని తస్కరించేస్తున్నారు సైబరాసురులు. ఈ నేపథ్యంలో అసలు జ్యూస్ జాకింగ్ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే నష్ట ఏమిటి? దాని నుంచి ఎలా బయటపడాలి? తెలుసుకుందాం రండి..పబ్లిక్ చార్జింగ్ పాయింట్లే కేంద్రంగా..
మీరు ఎప్పుడైనా లాంగ్ టూర్ వెళ్లారనుకోండి. చేతిలోని ఫోన్లో చార్జింగ్ అయిపోయింది. రెడ్ కలర్ లో బ్లింక్ అవుతూ ఉంది. ఆ సమయంలో మీరు బస్టాండ్ లోనో, రైల్వే స్టేషన్లోనో, లేకా ఏదైనా షాపింగ మాల్ లోనో పబ్లిక్ చార్జింగ్ పోర్టు కనపడితే, వెంటనే చార్జర్ తీసి ఫోన్ చార్జింగ్ పెడుతుంటాం. ఈ పరిస్థితి చాలా మంది అనుభవించే ఉంటారు. సరిగ్గా దీనినే నేరగాళ్లు తమ అస్త్రంగా మార్చుకున్నారు. పబ్లిక్ చార్జింగ్ పోర్టుల్లో చార్జింగ్ పెట్టిన ఫోన్లోని డేటా మొత్తాన్ని చోరీ చేస్తున్నారు ఈ చార్జింగ్ పోర్టుల ద్వారానే డేటాను తస్కరిస్తున్నారు. ఈ తరహా నేరాలు ఇటీవల మన దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. దీంతో అమెరికాలోని ఎఫ్‌బీఐ తన ప్రజలకు దీనిపై అప్రమత్తంగా ఉండాలని పలు హెచ్చరికలు జారీ చేసింది. మాల్స్, మార్కెట్లు, బస్టాండ్లు వంటి పబ్లిక్ చార్జింగ్ పోర్టుల వద్ద చార్జింగ్ పెట్టొద్దని, సొంత పవర్ బ్యాంకులను తీసుకెళ్లాలని సూచించింది.
జ్యూస్ జాకింగ్ అంటే..
జ్యూస్ జాకింగ్ అనేది ఒక రకమైన సైబర్ అటాక్. ఇక్కడ స్కామర్లు బహిరంగ ప్రదేశాల్లో నకిలీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. ఈ చార్జింగ్ స్టేషన్లు వాటికి ప్లగ్ చేయబడిన పరికరాల నుంచి సున్నితమైన డేటా ను రహస్యంగా దొంగిలించడమే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. ఎవరైనా తమ పరికరాన్ని నకిలీ చార్జింగ్ పోర్ట్‌లోకి ప్లగ్ చేసినప్పుడు, స్కామర్లు వారి పరికరానికి యాక్సెస్‌ను పొందుతారు.దానిలోని పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ వివరాలు, ఇతర ప్రైవేట్ డేటా వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. కొన్ని సందర్భాల్లో, స్కామర్లు నేరుగా బాధితుడి పరికరంలోకి మాల్వేర్ను ఇంజెక్ట్ చేసి, తద్వారా వారు పరికరాన్ని రిమోట్‌గా నియంత్రణలోకి తీసుకుంటారు.ఇలా చేస్తే సురక్షితంగా ఉంటారు..
వాస్తవానికి చార్జింగ్ స్టేషన్లు నకిలీవి లేదా చట్టబద్ధమైనవి కాదా అనేది వినియోగదారులకు గుర్తించడం కష్టం. అందుకే కొన్ని టిప్స్‌ని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
ప్రయాణిస్తున్నప్పుడు మీకు చార్జింగ్ అవసరమైతే, ఎల్లప్పుడూ పోర్టబుల్ పవర్ బ్యాంక్‌ని తీసుకెళ్లండి.
అదనపు భద్రత కోసం, యూఎస్బీ డేటా బ్లాకర్‌ని ఉపయోగించండి. ఇది మీ పరికరం, ఛార్జింగ్ స్టేషన్ మధ్య డేటా మార్పిడిని నిరోధించే చిన్న అడాప్టర్.
తెలియని నెట్‌వర్క్‌లు లేదా పరికరాలకు ఆటోమేటిక్ కనెక్షన్‌ని నిలిపివేయడం ద్వారా సంభావ్య బెదిరింపుల నుంచి మీ పరికరాన్ని రక్షించుకోవచ్చు.
ప్రసిద్ధ వైఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించడం ద్వారా ఆన్లైన్లో సురక్షితంగా ఉండొచ్చు. దాడులకు గురయ్యే అవకాశం ఉన్న ఓపెన్ నెట్ వర్క్ లేదా అసురక్షిత కనెక్షన్లను నివారించండి.
మీ పరికరాన్ని దాని సాఫ్ట్‌వేర్‌ను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం ద్వారా రక్షించుకోండి. కొత్త అప్డేట్లలో సెక్యూరిటీ ఫీచర్లు తప్పనిసరిగా అప్డేట్ చేస్తారు. కాబట్టి ఇవి మీఫోన్ సంరక్షిస్తాయి.
అనధికార యాక్సెస్ ప్రమాదాన్ని తగ్గించడానికి, మీ పరికరం చార్జ్ అవుతున్నప్పుడు అన్‌లాక్ చేయకుండా ఉండండి.