Kidney Stones: మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లే!!కిడ్నీలో రాళ్లు బాగా పెరిగే వరకు కూడా అవి ఉన్నట్లు తెలియకపోవడంతో.. ఈ సమస్య తీవ్రతరం అవుతోంది. ప్రారంభంలోనే కిడ్నీలో రాళ్లు ఉన్న సంగతిని తెలుసుకునే వీలుంది. శరీరంలో కలిగే కొన్ని లక్షణాల వల్ల కిడ్నీలో రాళ్లున్న..
ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడుతున్నారు. అయితే దీన్ని కాస్త ముందుగానే గుర్తిస్తే.. ఆపరేషన్ల వరకూ తెచ్చుకోనవసరం లేదు. కిడ్నీలో రాళ్లు బాగా పెరిగే వరకు కూడా అవి ఉన్నట్లు తెలియకపోవడంతో.. ఈ సమస్య తీవ్రతరం అవుతోంది. ప్రారంభంలోనే కిడ్నీలో రాళ్లు ఉన్న సంగతిని తెలుసుకునే వీలుంది. శరీరంలో కలిగే కొన్ని లక్షణాల వల్ల కిడ్నీలో రాళ్లున్న సంగతిని గుర్తించవచ్చు. మరి కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించే ఆ లక్షణాలు ఏంటో తెలుసుకోండిలా.కిడ్నీలో రాళ్లు ఉంటే వీపు కింద కుడి లేదా ఎడమ భాగంలో నొప్పి వస్తుంది. అలాగే ముందు వైపు బొడ్డు కింద లేదా కుడి లేదా ఎడమ వైపు నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పి కూడా సూదితో పొడిచినట్లుగా వస్తుంది.
-మూత్రం విసర్జించే సమయంలో మంట లేదా నొప్పిగా ఉంటే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లే.కిడ్నీలో రాళ్లు ఉన్నవారు మూత్రం రక్తం రంగులో ఉంటుంది. మరికిన్నిసార్లు రక్తం కూడా పడవచ్చు. అలాగే మూత్రం దుర్వాసన వస్తుంది.
-వాంతికి వచ్చినట్లు ఉండటం, వికారం, జ్వరం వంటి లక్షణాలు ఉన్నా.. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.
ఈ సమస్య యూరిన్ వచ్చినప్పుడు వెళ్లకుండా ఆపుకుంటే తలెత్తవచ్చు. కాబట్టి మూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపుకోకూడదు. అలాగే తగినంతగా నీరు కూడా తీసుకుంటూ ఉండాలి.