Morning Food: ఉదయాన్నే పరగడుపున ఈ ఆహారాలు తింటే ఆరోగ్యం పదిలం.. అనేక రోగాలు దూరం..శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు నిత్యం పోషకాలతో కూడిన హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటె దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండగలం. అందుకే ఎప్పుడూ ఆహారపు అలవాట్లు విషయంలో జాగ్రత్తలు వహించాలి. అయితే చాలామంది ఉదయం లేచినవెంటనే ఏది పడిదే అది తింటుంటారు. ఇంకొంతమంది అయితే ఉదయం లేచిన తరువాత చాలా సేపటి వరకూ తినరు. అందుకే ఉదయం లేచిన వెంటనే తినదగిన ఆహారల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు నిత్యం పోషకాలతో కూడిన హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటె దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండగలం. అందుకే ఎప్పుడూ ఆహారపు అలవాట్లు విషయంలో జాగ్రత్తలు వహించాలి. అయితే చాలామంది ఉదయం లేచినవెంటనే ఏది పడిదే అది తింటుంటారు. ఇంకొంతమంది అయితే ఉదయం లేచిన తరువాత చాలా సేపటి వరకూ తినరు.ఈ క్రమంలో రోజూ లేచిన వెంటనే ఏం తినాలి, ఏం తినకూడదనే విషయాలు తెలుసుకోవాలి. అందుకే ఉదయం లేచిన వెంటనే తినదగిన ఆహారల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు మీ దరి చేరవు. మరి అవేమిటంటే.ఎండు ద్రాక్: ఎండు ద్రాక్షలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పుష్కలంగా ఐరన్, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. రోజూ వీటిని తింటే శరీర బలహీనత దూరమవడమే కాక రక్తంలో హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. పరగడుపున కిస్మిస్ తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ రాత్రి 6 కిస్మిస్ నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తినాలి.బాదం: బాదంలో అధికమొత్తంలో ప్రోటీన్లు, ఫైబర్ వంటి పోషకాలుంటాయి. ఉదయం పరగడుపున వీటిని తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇది బరువు తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. నానబెట్టిన బాదం పప్పులను రోజూ తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.ఎండు ఖర్జూరం: ఎండు ఖర్జూరంలో పోషకలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం లేచినవెంటనే తినడం వల్ల శరీరానికి కావల్సినంత ఐరన్ లభిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది.జీడిపప్పు: జీడిపప్పు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. ఇందులో కాపర్, ఫాస్పరస్, జింక్, ఐరన్, మాంగనీస్, సెలీనియంతో పాటు అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్స్, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ మితంగా జీడిపప్పు తీసుకుంటే పోషక లోపం వల్ల వచ్చే అనేక వ్యాధులను నివారించవచ్చు. జీడిపప్పు గుండె జబ్బులను నివారిస్తుంది. రోగ నిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. ఎముకలను దృడంగా ఉంచుతుంది. జీడిపప్పులో ఉండే లుటిస్ కంటిచూపును మెరుగుపరుస్తుంది.