Andhra Pradesh: ఇయర్ ఫోన్స్, హెడ్ సెట్ పెట్టుకుని వాహనం నడిపితే 20 వేలు ఫైన్ఏపీ సర్కార్ రోడ్డు ప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టింది. కొంతమంది హెడ్ సెట్స్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ, పాటలు వింటూ వాహనాలు నడుపుతున్నట్లు నిర్ధారించింది. దీంతో సంచలన నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదేశ్, జులై 26: వాహనాన్ని నడుపుతూ.. హెడ్ సెట్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ, పాటలు వినేవారికి అలెర్ట్. ఇలాంటి పనుల కారణంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని.. జీవితాలు అర్థాంతరంగా ఆగిపోతున్నాయని ఏపీ సర్కార్ గుర్తించింది. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్సెట్ పెట్టుకుంటే 20,000 ఫైన్ వేయబోతున్నట్లు తెలిపింది. ఆగస్టు నెల నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. బైక్ మీద మాత్రమే కాదు.. కారు కానీ ఆటో కానీ.. మరే ఇతర వాహనంలో అయినా కానీ ఇయర్ ఫోన్స్ హెడ్సెట్ పెట్టుకుని.. నడిపితే మాత్రం 20,000 జరిమానా వేయనుంది.
వాహనం నడుపుతూ ఇలా హెడ్ సెట్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకుంటే వెనుక నుంచి హారన్ కొట్టేది కూడా తెలీదు. ఎవరైనా ఓవర్ టేక్ చేయాలన్నా కూడా ఇబ్బంది కలుగుతుంది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అందుకే ఏపీ సర్కార్ కఠినమైన జరిమానా విధించేందుకు సిద్దమైంది.