Skyball Smartwatch: స్మార్ట్ వాచ్ కేటగిరిలోకి మరో టాప్ బ్రాండ్ స్కైబాల్.. అడ్వాన్స్డ్ ఫీచర్లలో రెండు కొత్త స్మార్ట్ వాచ్‌లు లాంచింగ్‌కు రెడీ..ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ స్కైబాల్ స్మార్ట్ వాచ్ కేటగిరీలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. స్మార్ట్‌వాచ్‌ల పరిశ్రమలో కొత్త ప్రమాణాలను సృష్టించాలని స్కైబాల్ ప్రణాళిక చేస్తోంది. అందులో భాగంగా ఈ సంవత్సరం ఏకంగా ఐదు కొత్త స్మార్ట్‌వాచ్ మోడల్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు స్కైబాల్ ప్రకటించిందిప్రస్తుతం ట్రెండీ ఐటెం స్మార్ట్ వాచ్. అందరూ వీటిని ఇష్టంగా వాడుతున్నారు. అందుకు కారణం వీటిలో వస్తున్న అధునాతన ఫీచర్లేనని చెప్పాలి. ఒకప్పుడు వాచ్ అంటే కేవలం టైం చూసుకోడానికి, కొంతమంది స్టైల్ కోసం మాత్రమే వాడేవారు. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో అధునాతన ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్‌లో వస్తున్నాయి. దీంతో అన్ని ఎలక్ట్రానిక్ కంపెనీలు ఈ స్మార్ట్ వాచ్ ల ఉత్పత్తిని ప్రారంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ స్కైబాల్ స్మార్ట్ వాచ్ కేటగిరీలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. స్మార్ట్‌వాచ్‌ల పరిశ్రమలో కొత్త ప్రమాణాలను సృష్టించాలని స్కైబాల్ ప్రణాళిక చేస్తోంది. అందులో భాగంగా ఈ సంవత్సరం ఏకంగా ఐదు కొత్త స్మార్ట్‌వాచ్ మోడల్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు స్కైబాల్ ప్రకటించింది. వీటిలో రెండు మోడళ్లు స్కైఫిట్ ఎలివేట్, స్కైఫిట్ రిగర్ లను ఈ ఏడాది ఆగస్టులో ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది.సరికొత్త డిజైన్ తో..
స్కైబాల్ స్మార్ట్‌వాచ్‌లను సరికొత్త డిజైన్ లో, అత్యుత్తమ పనితీరు కలిగినవిగా తీర్చిదిద్దుతున్నట్లు స్కైబాల్ పేర్కొంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను అందిస్తున్నట్లు వివరించింది. ఈ స్మార్ట్ వాచ్ లు ప్రీమియం, ఫీచర్ రిచ్ గా ఉంటాయి చెబుతోంది. అడ్వాన్స్ డ్ ఫీచర్లుంటాయని, అమోల్డ్ డిస్ ప్లే తో వైబ్రెంట్ విజువల్స్, క్లారిటీతో ఉంటాయని వివరించింది. పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి వివరాలు కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
ఈ సందర్భంగా స్కైబాల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ గుప్తా మాట్లాడుతూ వినియోగదారుల అంచనాలకు మించి తమ ఉత్పత్తులు ఉంటాయని తెలిపారు. కస్టమర్ల విభిన్న అవసరాలను తీర్చడానికి స్కైఫిట్ ఎలివేట్, స్కైఫిట్ రిగర్‌లను చాలా పరిశోధనల అనంతరం రూపొందించామని పేర్కొన్నారు.దీపావళి నాటికి మరో మూడు స్మార్ట్ వాచ్ లు..
స్కైబాల్ దీపావళికి ముందే మార్కెట్లో తన ఉనికిని పదిలపరుచుకునేలా ప్రణాళిక చేస్తోంది. ఆ లోపే మరో మూడు మోడళ్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది స్మార్ట్‌వాచ్ విభాగంలో 1,00,000 యూనిట్ల అమ్మకాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ లతో పాటు ఆడియో రేంజ్ కోసం కూడా కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. పార్టీ స్పీకర్లను దీపావళి నాటికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.