పుట్టగొడుగులతో మధుమేహానికి చెక్ పెట్టండిలాసాధారణంగా తినే అన్నం మోతాదులో కాస్త తక్కువగా తిని.. మిగతా రైస్ కి బదులు చపాతీ లేదా పుల్కా తింటే సరిపోతుంది. మన ఇంట్లో వండే ఆహారపదార్థాల్లో.. కొన్నింటి ద్వారా షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. సీజనల్ గా దొరికే వాటిలో పుట్టగొడుగులు..మధుమేహం.. దానినే వాడుకలో షుగర్ వ్యాధి అంటుంటాం. వయసు పైబడిన వారికే కాదు.. ఊబకాయం ఉన్నవారిలోనూ ఇప్పుడు షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయి. అయినా ప్రస్తుతం వారు వీరు అనే తేడా లేకుండా డయాబెటీస్ అందరికీ వస్తుంది. నిజానికి కొన్ని ఆహార నియమాలను పాటిస్తే.. షుగర్ పెద్ద ప్రాణాంతకమైన వ్యాధి కాదు. వైట్ రైస్ తింటే షుగర్ పెరుగుతుందనేది కొందరి అపోహ.సాధారణంగా తినే అన్నం మోతాదులో కాస్త తక్కువగా తిని.. మిగతా రైస్ కి బదులు చపాతీ లేదా పుల్కా తింటే సరిపోతుంది. మన ఇంట్లో వండే ఆహారపదార్థాల్లో.. కొన్నింటి ద్వారా షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. సీజనల్ గా దొరికే వాటిలో పుట్టగొడుగులు కూడా ఉంటాయి. ప్రత్యేకించి వర్షాకాలంలో లభించే వాటిలో.. పుట్టగొడుగులూ ఒకటి.
పుట్టగొడుగులతో షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. వీటిలో పిండి పదార్థాలు అధికంగా, కొవ్వును పెంచే గుణాలు తక్కువగా ఉంటాయి. అంతేకాదు ప్రొటీన్, ఫైబర్, ఇతర పోషకాలు అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఆకలి ఎక్కువగా ఉంటుంది. కానీ అన్ని పదార్థాలను తినలేరు. అలాంటపుడు పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం ద్వారా కడుపునిండుగా ఉండి ఎక్కువ ఆహారం తీసుకోలేరు.త్వరగా ఆకలి ఉండదు. ఇదే సమయంలో శరీర బరువు తగ్గడంలోనూ పుట్టగొడుగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తాయి. పుట్టగొడుగులు జీవక్రియ రుగ్మతలు, గుండెపోటు (heart attack), రక్తపోటు (blood pressure)ను కూడా తగ్గించడంలో సహాయపడుతాయి. ఈ సీజన్లో ఫ్రెష్ గా లభించే వీటిని.. శుభ్రం చేసి కూరగా చేసుకుని అన్నం లేదా చపాతీలు, పుల్కాలు, జొన్నరొట్టెల్లో కలిపి ఎంచక్కా తినేయొచ్చు. వారానికి రెండు, మూడుసార్లు పుట్టగొడుగులను ఆహారంలో తీసుకోవడం వల్ల మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.