Groundnut-Beetroot: శనగపిండి-బీట్ రూట్ తో ఇలా చేస్తే.. మీ చర్మం మెరవడం ఖాయంఉరుకుల పరుగుల జీవితం. అంతా హడావిడి. ట్రాఫిక్ లో ఆఫీసులు, కాలేజీలకు వెళ్లి.. ఇంటికొచ్చేసరికి.. ఆ పొల్యూషన్ లో చర్మంపై మృత కణాలు పేరుకుపోతాయి. అది టాన్ గా మారి చర్మం నల్లబడుతుంటుంది. దానిని క్లీన్ చేయించుకునేందుకు బ్యూటీ పార్లర్ కు వెళ్లాలి. కానీ..ఉరుకుల పరుగుల జీవితం. అంతా హడావిడి. ట్రాఫిక్ లో ఆఫీసులు, కాలేజీలకు వెళ్లి.. ఇంటికొచ్చేసరికి.. ఆ పొల్యూషన్ లో చర్మంపై మృత కణాలు పేరుకుపోతాయి. అది టాన్ గా మారి చర్మం నల్లబడుతుంటుంది. దానిని క్లీన్ చేయించుకునేందుకు బ్యూటీ పార్లర్ కు వెళ్లాలి. కానీ.. ఈ మిశ్రమాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరే ఇక ఇంటివద్దే టాన్ ను తొలగించుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలో చూద్దాం.
రెండు – మూడు బీట్ రూట్ లను తీసుకుని.. వాటి తొక్కలు తీసేసి.. సన్నగా కోరు తీసుకోవాలి. అలా తరిగిన బీట్ రూట్ ను పూర్తిగా ఎండేంత వరకూ రెండు మూడు రోజులు ఎండలో ఎండబెట్టాలి. తడిలేకుండా పూర్తిగా ఎండిన బీట్ రూట్ పొడిని సాఫ్ట్ గా అయ్యేంత వరకూ చేతితో నలపాలి. ఇప్పుడీ బీట్ రూట్ పొడికి రెండింతలు సమంగా శనగపిండిని తీసుకుని అందులో కలుపుకోవాలి.
దీనిని ఒక గాజు సీసాలో(గాజు సీసానే ఎందుకంటే పురుగు పట్టకుండా ఉంటుంది) భద్రపరచుకోవాలి.ప్రతిరోజు రాత్రి స్నానం చేశాక.. రెండు మూడు స్పూన్ల ఈ మిశ్రమంలో రోజ్ వాటర్ లేదా మామూలు నీరు కలిపి.. ముఖం, మెడ, చేతులకు పట్టించాలి. అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.డ్రై స్కిన్ ఉన్నవారు రోజ్ వాటర్ బదులు పాలను వాడటం మంచిది. క్లీన్ చేసిన వెంటనే సబ్బు, బాడీ లోషన్, మాయిశ్చరైజర్ వంటివి వాడకూడదు. లేదంటే స్నానం చేసే ముందే శరీరానికి నలుగులా పెట్టుకోవచ్చు. ఇలా ప్రతిరోజూ చేస్తే మీ చర్మసౌందర్యం పెరగడంతో పాటు.. ముఖం కూడా కాంతివంతంగా ఉంటుంది. ముఖం, మెడ, చేతులపై పేరుకున్న టాన్ తొలగిపోతుంది.