Viral News: ప్రేమ కోసం ప్రియురాలి సాహసం.. ప్రియుడిని చితక్కొట్టిన గ్రామస్తులు.. చివరకు ఇదీ జరిగింది..!అయితే గ్రామంలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేదని చెప్పారు విద్యుత్ శాఖ అధికారులు. కానీ, మీ ఊరిలో కరెంట్ ఎందుకు పోతుందో తెలియదని చెప్పారు. గ్రామంలోనే ఏదో ఒక సమస్య ఉండి ఉండవచ్చని అధికారులు తెలిపారు. దీంతో గ్రామంలో రాత్రిపూట కరెంటు ఎందుకు పోతుందో తెలుసుకోవడానికి గ్రామస్తులు నిర్ణయించుకున్నారు.ప్రేమికులు ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకుంటారు.. ఏదో ఒక విధంగా ఒక్కటవ్వాలని ప్రయత్నిస్తారు. అదేవిధంగా బీహార్‌లో ఒక ప్రేమ జంట చేసిన పనితో ఊరు ఊరంతా చీకట్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇక్కడ దూరంగా ఉంటున్న తన ప్రియురాలిని కలుసుకునేందుకు ఆ ప్రేమికుడు పట్టణం మొత్తం విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో గ్రామస్తులు అతన్ని పట్టుకుని చితక్కొట్టారు. ఈ ఘటన బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌లో చోటుచేసుకుంది. బెట్టయ్య గ్రామానికి చెందిన ప్రీతి అనే యువతి రాజ్‌కుమార్‌ను ప్రేమించింది. కానీ ఒకరినొకరు కలుసుకోలేకపోయారు. దాంతో రాజ్‌కుమార్‌ని ఎలా కలవాలో తెలియక ప్రీతి ఆందోళన చెందుతోంది.
ఏదో ఒకటి చేసి తన ప్రేమికుడిని కలవాలని నిర్ణయించుకున్న ప్రీతి.. రాత్రిపూట గ్రామంలోని విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ప్లాన్ చేసింది. అనుకున్నదే తడవుగా ప్రతి రోజు రాత్రి వేళ ఊరంతా కరెంట్ కట్ చేసి ప్రేమికులిద్దరూ కలుసుకునేవారు. ఇలా చాలా రోజులుగా గ్రామంలో ఇదే జరుగుతూ వస్తోంది. ప్రతి రోజు రాత్రైతే చాలు.. ఊరంతా కరెంట్ పోతుంది. క్రమం తప్పకుండా రాత్రి వేళ కరెంటు పోవడంతో గ్రామ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అలాగే కరెంటు లేకపోవడంతో గ్రామంలో దొంగతనాలు కూడా పెరిగిపోయాయి. దీంతో విసిగిపోయిన గ్రామస్తులు సంబంధిత శాఖకు ఫిర్యాదు చేశారు.
అయితే గ్రామంలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేదని చెప్పారు విద్యుత్ శాఖ అధికారులు. కానీ, మీ ఊరిలో కరెంట్ ఎందుకు పోతుందో తెలియదని చెప్పారు. గ్రామంలోనే ఏదో ఒక సమస్య ఉండి ఉండవచ్చని అధికారులు తెలిపారు. దీంతో గ్రామంలో రాత్రిపూట కరెంటు ఎందుకు పోతుందో తెలుసుకోవడానికి గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. రోజూ ఒకే సమయానికి కరెంటు పోవడంతో గ్రామస్తులు గుర్తించారు. గ్రామంలో విద్యుత్‌ను ఎవరో నిలిపివేస్తున్నారనే అనుమానం వచ్చింది. ఒకరోజు కరెంటు పోవడంతో గ్రామస్థులు రాజ్‌కుమార్,ప్రీతిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ప్రతిరోజు గ్రామంలో కరెంటు కట్ చేసేది ఈ ప్రేమికులేనని గ్రామస్థులు తెలుసుకున్నారు. ప్రియుడిని కలిసేందుకే ఆమె ఇలా చేస్తోందని తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహానికి గురై రాజ్‌కుమార్‌ను పట్టుకుని కొట్టారు. తమను ఏమీ చేయవద్దని ప్రీతి పట్టణ పెద్దలను వేడుకుంది. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, ఒకరినొకరు కలవడం కోసమే ఇలా చేస్తున్నామని ప్రీతి అంగీకరించింది. అనంతరం గ్రామస్తులంతా కలిసి ప్రీతి, రాజ్‌కుమార్‌లను ఆశ్వీరదించి.. శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వీరి ప్రేమ కథా సుఖాంతం అయింది.