బీఆర్ఎస్ పార్టీకి ఆ మాజీ మంత్రి బైబై.. గులాబి బాస్ మౌనంతో ‘పట్నం’ నేత బేజారు.. కాంగ్రెస్ నుంచి ఆఫర్లు..!Telangana Politics: తాండూర్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ వీడేందుకు సిద్దమయినట్టు సమాచారం. బిఆర్ఎస్ నుంచి టిక్కెట్ రాకుంటే ఇక పార్టీకి రాజీనామా చేసి హస్తం గూటికి వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. చివరి ప్రయత్నాలుగా..Telangana Politics: తాండూర్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ వీడేందుకు సిద్దమయినట్టు సమాచారం. బిఆర్ఎస్ నుంచి టిక్కెట్ రాకుంటే ఇక పార్టీకి రాజీనామా చేసి హస్తం గూటికి వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. చివరి ప్రయత్నాలుగా గులాబీ బాస్ దగ్గర లాబీయింగ్ చేస్తూనే అటు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై సొంతగా ఇంటర్నల్ సర్వే కూడా చేయిస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచిడి బిఆర్ఎస్కు వచ్చారు. కాబట్టి అటు కాంగ్రెస్ పెద్దలు కుడా పట్నం ఫ్యామిలి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.P.Mahender Reddy and Sunitha Mahender Reddy
తాండూర్ ఎమ్మెల్య గా పట్నం మహేందర్ రెడ్డి.. చేవెళ్ల ఎంపీగా అయన భార్య సునీత మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ అఫర్ ఇచ్చినట్టు సమాచారం. అయితే పట్నం తమ్ముడు నరేందర్ రెడ్డి కూడా బిఆర్ఎస్ నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయన అన్నతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదంట. అయితే పట్నం మహేందర్ రెడ్డి మాత్రం టిక్కెట్ దక్కకుంటే పార్టీ మారడం ఖాయమనేది తాజా ప్రచారం. బిఆర్ఎస్ పెద్దలు తాండూర్పై ఏది తేల్చలేక పోవడం అటు పట్నంకు ఇబ్బందిగా మారుతుందట. గులాబీ బాస్ ఇలానే సాగదీస్తే శ్రవణంలో ఒక మంచి రోజు చూసుకొని కాంగ్రెస్ గూటికి వెళ్లడం పక్కాగా కనిపిస్తుంది.