Urfi Javed: వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఉర్ఫీ జాదవ్ఇప్పుడు ఇలానే సర్జరీ చేయించుకొని భయంకరంగా తయారైంది నటి ఉర్ఫీ జాదవ్. బాలీవుడ్ నటి ఉర్ఫీ జాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ అమ్మడు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పటిస్పీట్ చేసిన దగ్గర నుంచి మంచి క్రేజ్ తెచ్చుకుంది.లేనిదానికోసం ప్రయత్నిస్తే ఉన్నది కూడా పోతుంది అని మన పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదే సామెత కొంతమంది హీరోయిన్స్ విషయంలో నిజమైంది. లేని అందం కోసం ట్రై చేసి అసలైన అందాన్ని పోగొట్టుకున్న భామలు చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే మరీ వికృతంగా కూడా మారిపోయారు. ఇప్పుడు ఇలానే సర్జరీ చేయించుకొని భయంకరంగా తయారైంది నటి ఉర్ఫీ జాదవ్. బాలీవుడ్ నటి ఉర్ఫీ జాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ అమ్మడు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పటిస్పీట్ చేసిన దగ్గర నుంచి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక బయటకు వచ్చిన తర్వాత రకరకాల డ్రస్సులతో కనిపించి అందరిని షాక్ కు గురి చేస్తూ ఉంటుంది. ఎవ్వరూ ధరించని చిత్రవిచిత్ర డ్రస్సులు వేసుకొని అందరిని ఆకర్షిస్తుంది ఉర్ఫీ.రకరకాల వస్తువులతో డ్రస్ గా మార్చేసి ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటుంది ఈ చిన్నది. ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇప్పుడు సర్జరీ చేయించుకొని ఉన్న అందాన్ని పోగొట్టుకుంది. ఉర్ఫీ జాదవ్ తన పెదవులకు సర్జరీ చేయించుకున్నా అని దాంతో తన అందం పోయిందని తెలిపింది.తాను 18 సంవత్సరాల వయస్సు నుంచి లిప్ ఫిల్లర్లను ఆశ్రయిస్తున్నా అని తెలిపింది. నా పెదవులు చాలా చిన్నగా ఉంటాయి. కానీ నాకు పెదవులు పెద్దగా.. నిండుగా ఉండాలని కోరిక. కానీ సర్జరీ చేయించుకోవడంతో నా అందమంతా పోయింది అని తెలిపింది. శస్త్ర చికిత్సలు చేయించుకునేటప్పుడు జాగ్రత్త అని తెలిపింది ఉర్ఫీ జాదవ్.