Bro Movie: అదరగొట్టిన తమన్.. పవర్ స్టార్ బ్రో మూవీ నుంచి థీమ్ సాంగ్..ఇప్పటికే బ్రో మూవీ నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ పోస్టర్స్ దగ్గర నుంచి అన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. టీజర్ అయితే సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది. అలాగే బ్రో నుంచి వచ్చిన సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.బ్రో సినిమా పై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటికి వరకు బ్రో మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూసిన ఫాన్స్ కు ఇప్పుడు వరుస అప్డేట్స్ తో ఆకట్టుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే బ్రో మూవీ నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ పోస్టర్స్ దగ్గర నుంచి అన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. టీజర్ అయితే సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది. అలాగే బ్రో నుంచి వచ్చిన సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమా పక్కాగా సూపర్ హిట్ అవుతుంది అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో పవర్ స్టార్ దేవుడి తరహా పాత్రలో కనిపించనున్నారు. మామ అల్లుడు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ రోజు (జులై 25న) బ్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే బ్రో మూవీ నుంచి థీమ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమానుంచి తాజాగా వచ్చిన థీమ్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కల్యాణ్ చక్రవర్తి ఈ పాటకు సాహిత్యం అందించారు.
బ్రో అనే టైటిల్ కు లింక్ చేస్తూ ఈ సాంగ్ సాగుతుంది. ఇక సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కాలం నేపథ్యంలో సాగే కథ ఈ సినిమా.. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.