Mysterious Video: ఆకాశంలో కనిపించిన ‘స్వర్గానికి ప్రవేశ ద్వారం’.. అంతుచిక్కని మిస్టరీగా వింత ఆకారంమేఘావృతమైన ఆకాశంలో ఓ మిస్టీరియస్ ఆకారం కనిపించడం ప్రస్తుతం చర్చణీయాంశమైంది. ఆకాశంలో ద్వారాలు (తలుపులు) మాదిరి ఉన్న ఆకారం ఒకటి వెలుగులు విరజిమ్ముతూ ఉన్నట్లు వీడియోలో చూడొచ్చు. బెంగళూరులోని..బెంగళూరు, జులై 25: మేఘావృతమైన ఆకాశంలో ఓ మిస్టీరియస్ ఆకారం కనిపించడం ప్రస్తుతం చర్చణీయాంశమైంది. ఆకాశంలో ద్వారాలు (తలుపులు) మాదిరి ఉన్న ఆకారం ఒకటి వెలుగులు విరజిమ్ముతూ ఉన్నట్లు వీడియోలో చూడొచ్చు. బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్ సమీపంలో శనివారం రాత్రి ఈ వింత కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వసీమ్ అనే యూజర్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆకాశంలో భవనం, ఆ భవనానికి సంబంధించిన తలుపులు, తలుపుల వెనుక ప్రకాశవంతమైన వెలుగు కనిపించడం వెనుక ఉన్న సైన్స్ రహస్యం ఏమై ఉండవచ్చు? అని ప్రతిఒక్కరూ జుట్టులు పీక్కుంటున్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు సరదాగా తీసుకుంటే.. మరికొందరేమో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది మరో ప్రపంచానికి ప్రవేశ మార్గం అని, బెంగుళూరు వాతావరణంలో ఏలియన్స్ తమ బట్టలు ఆరబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ సరదాగా కామెంట్ సెక్షన్లో రాసుకొచ్చారు. ఒక వేళ అది ఏలియన్స్ పనే అయితే దయచేసి మా రోడ్లను బాగు చేసి వెల్లండి అని, కొత్తగా రీల్స్ ఏమైన ట్రై చేస్తున్నారా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.అవి స్వర్గానికి ప్రవేశ ద్వారాలంటూ మరికొందరు ఆధ్యాత్మికను జోడించారు. అచ్చం ఇలాంటి రూపమే చైనాలో 2017లో ఆకాశంలో కనిపించిందని మరో యూజర్ కామెంట్ సెక్షన్లో తెలిపారు. ఏదిఏమైనప్పటికీ ఇది టెక్నాలజీ సృష్టించిన జిమ్మిక్కో, లేదా నిజంగానే ఆకాశంలో ఇలాంటి వింత జరిగిందో స్పష్టంగా తెలియరాలేదు.