Gift Ideas to Parents: మీ అమ్మానాన్నలకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకొంటున్నారా? అయితే ఈ టెక్ గ్యాడ్జెట్లు ఓసారి ట్రై చేయండి..మీరు కూడా మీ తల్లిదండ్రులకు ఏదైనా బెస్ట్ గిఫ్ట్ ఇచ్చి వారి సంతోష పెట్టాలని ఆలోచిస్తుంటే మీకు ఇవి బెస్ట్ ఆప్షన్లు. ప్రస్తుతం మార్కెట్లో అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. అవి మీ తల్లిదండ్రుల పనిని సులభతరం చేయడంతో పాటు వారిని మరింత స్టైల్‌గా కూడా మార్చేస్తాయి.తల్లిదండ్రును గౌరవించడానికి, వారిని సత్కరించడానికి ప్రత్యేకమైన సందర్భాలు ఏమి ఉండాల్సిన అవసరం లేదు. వాస్తవానికి పేరెంట్స్ పిల్లల నుంచి పెద్దగా ఏమి ఆశించరు గానీ.. వారి ప్రేమకు గుర్తుగా, వారు మనపై చూపించే వాత్సల్యానికి ప్రతీకగా అప్పుడప్పుడు బహుమతులు ఇస్తుండటం మంచిది. చా లా మంది ఇదే విధంగా వారి తల్లిదండ్రులపై వారి ప్రేమను కనబరుస్తారు. మీరు కూడా మీ తల్లిదండ్రులకు ఏదైనా బెస్ట్ గిఫ్ట్ ఇచ్చి వారి సంతోష పెట్టాలని ఆలోచిస్తుంటే మీకు ఇవి బెస్ట్ ఆప్షన్లు. ప్రస్తుతం మార్కెట్లో అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. అవి మీ తల్లిదండ్రుల పనిని సులభతరం చేయడంతో పాటు వారిని మరింత స్టైల్‌గా కూడా మార్చేస్తాయి. అటువంటి బెస్ట్ టెక్ గ్యాడ్జెట్ గిఫ్ట్ ఐడియాలను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిపై ఓ లుక్కేయండి..స్మార్ట్ ఫోన్లు.. ఇటీవల కాలంలో మన దేశంలో టాప్ రేటెడ్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. మీ తల్లిదండ్రుల ఫోన్ పాతదై పోయినా.. లేద సరిగా పనిచేయక ఇబ్బందులు పడుతుంటే వారికి గిఫ్ట్‌గా ఓ స్మార్ట్ ఫోన్ ఇవ్వడం ఉత్తమమైన ఎంపిక అవుతుంది. ఇటీవల కాలంలో నథింగ్ ఫోన్(2), ఐక్యూఓఓ నియో 7ప్రో, లావా అగ్ని2 ఫోన్లు లాంచ్ అయ్యాయి. వీటిల్లో టాప్ ఫీచర్లున్నాయి.
స్మార్ట్ వాచ్.. మన దేశంలో బడ్జెట్ స్మార్ట్ వాచ్ లు పోటీపడుతున్నాయి. రూ. 1000లోపు ధరలోనే మీరు టాప్ ఫీచర్లున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ లను కొనుగోలు చేయొచ్చు. వాటిల్లో హెల్త్ మోనిటర్లు, ఫిట్ నెస్ ట్రాకర్లు, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లుండటంతో మీ తల్లిదండ్రులకు బాగా ఉపయుక్తంగా ఉంటాయి.ఇయర్ఫోన్లు/హెడ్ఫోన్లు.. స్మార్ట్ వాచ్‌ల లాగానే ఇండియా మార్కెట్లో ఇయర్ ఫోన్లుకూడా పెద్ద సంఖ్యలో లాంచ్ అవుతున్నాయి. మీరు ఒకవేళ మీ తల్లిదండ్రులకు వీటిని గిఫ్టగా ఇవ్వాలనుకుంటే వైర్, వైర్ లెస్, బడ్స్ వంటి ఆప్షన్లలో ఎంపిక చేసుకోవచ్చు.
స్పీకర్లు/హోం థియేటర్.. మీరు మీ తల్లిదండ్రులతో కలసి కాలం గడపటానికి, కలిసి టీవీల్లో సినిమాలు చూడటానికి ఇష్టపడే వారు అయితే మంచి స్పీకర్లు, హోమ్ థియేటర్ బాగా ఉపయోగపడతాయి. మంచి ఆడియో క్వాలిటీ ఉన్న వాటిని కొనుగోలు చేస్తే మరచిపోలేని ఫ్యామిలీ టైం మీ సొంతం అవుతుంది.
జియో ట్యాగ్/ఎయిర్ ట్యాగ్.. ఇది చిన్న ట్రాకింగ్ డివైజ్. దీంతో మీ వస్తువులు ఎక్కడ ఉన్నాయో సులభంగా గుర్తించవచ్చు. మీ పేరెంట్స్ ఐఫోన్ వాడుతున్నారనుకోండి, అప్పుడు ఈ ఎయిర్ ట్యాగ్ బాగా ఉపయోగపడుతుంది. మీ ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతే ఈ ఎయిర్ ట్యాగ్ మనకు ఫోన్ ఎక్కుడుంటే తెలిసేలా చేస్తుంది. ఒకవేళ మీరు తక్కువ ధరకే దీనిని కొనుగోలు చేయాలనుకొంటే మీకు జియో ట్యాగ్ ఉత్తమం.