CM Jagan: పవన్ కల్యాణ్ చంద్రబాబుకు వాలంటీర్.. లోకేశ్, బాలయ్యలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలువాలంటీర్లపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సేవా భావంతో పనిచేసే వాలంటీర్ల గురించి చంద్రబాబు, పవన్ సంస్కారం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులను విడుదల చేసిన జగన్ అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు.వాలంటీర్లపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సేవా భావంతో పనిచేసే వాలంటీర్ల గురించి చంద్రబాబు, పవన్ సంస్కారం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులను విడుదల చేసిన జగన్ అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, బాలయ్యలను టార్గెట్ చేస్తూ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కొన్ని జరుగుతున్న పరిస్థితులు చూసినప్పుడు, మాట్లాడకూడదు అని ఉన్నా కూడా మాట్లాడాల్సి వస్తోంది. ఎక్కడైనా మంచి చేస్తున్న వ్యవస్థల్ని, మనుషులను సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ అవమానించరు. కానీ మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి ఇటీవల సంస్కారాలు కోల్పోయి కొందరు మాట్లాడుతున్నందు వల్ల ఈ నాలుగు మాటలు కూడా మాట్లాడాల్సి వస్తోంది. వాలంటీర్లు ఎవరూ కొత్తవారు కాదు. మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నారు. వాలంటీర్లంతా మీ అందరికీ తెలిసిన వాళ్లే. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి గడప దగ్గరకు కాళ్లకు బలపం కట్టుకొని వెళ్లి.. కులం, వర్గం, ప్రాంతం, పార్టీలు చూడకుండా మీ ఇంటికి చేర్చే ఇలాంటి మనవళ్లు, మనవరాళ్ల వ్యవస్థ. అదే గ్రామంలో సేవలు చేసే మన ఊరి పిల్లల మీదే కొందరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. స్క్రిప్టు ఈనాడు రామోజీది అయితే, నిర్మాత చంద్రబాబు, నటన మాటలు, డైలాగులు అన్నీ దత్తపుత్రుడివి. వాలంటీర్లు స్త్రీలను లోబరుచుకుంటారని ఒకడంటాడు. అమ్మాయిలను హూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటాడు. బాంబేలకు పంపిస్తున్నాడని ఇంకొకడంటాడు నిస్సిగ్గుగా అబద్ధాలకు రెక్కలు తొడుగుతారు. అన్యాయంగా బురద జల్లుతారు. అక్షరాలా 2.60 లక్షల మంది మన పిల్లలు గ్రామస్థాయిలో సేవలు అందిస్తున్నారు. 60 శాతం నా చెల్లెమ్మలే. మన వాలంటీర్లంతా కూడా చదువుకున్న సంస్కారవంతులే. వీరంతా సేవా భావంతో పని చేస్తున్న అదే గ్రామంలో ఉన్న ఇరుగు పొరుగు పిల్లలే. మన సేవా మిత్రలు, మన సేవా రత్నాలు, సేవా వజ్రాలు అయిన మన వాలంటీర్ల క్యారెక్టర్‌ను తప్పు పడుతున్నారు’ అని జగన్ ధ్వజమెత్తారు.‘ వాలంటీర్ల క్యారెక్టర్ ఎలాంటిదో వారి చేత సేవలందుకుంటున్న కోట్ల మందికి తెలుసు. ఈ చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిదో, దత్తపుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో, ఆయన సొంత పుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో, ఆయన బావమరిది క్యారెక్టర్ ఎలాంటిదో ఇవి కూడా ప్రజలకు బాగా తెలుసు. పవన్ బాబు వాలంటీర్. ఆయన నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆయనతో పాటు చంద్రబాబు, లోకేష్ మెదడులో అన్నీ పురుగులే కనిపిస్తాయి. బీజేపీతో పొత్తు, చంద్రబాబుతో కాపురం. ఇచ్చేది తన పార్టీ బీ ఫామ్. నిజానికి తనది టీడీపీకి బీటీమ్. చంద్రబాబు మీద పోటీ ఓ డ్రామా, బీజేపీతో స్నేహం మరో డ్రామా, తనది ప్రత్యేక పార్టీ అనేది ఇంకో డ్రామా. మన నేతన్నల వస్త్రాలన్నీ కూడా అమ్మే ఏర్పాట్లు జరిగింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే మనసుపెట్టి చేసింది అని తెలియజేస్తున్నా. వెనుకబడిన సామాజిక వర్గాలకు, అట్టడుగున ఉన్నసామాజిక వర్గాలకు అన్ని రకాలుగా చేయి పట్టుకొని నడిపించాం’ అని జగన్ పేర్కొన్నారు.