Mount kailash: శివభక్తులకు గుడ్ న్యూస్.. శివుని నివాస స్థలంగా భావించే మౌంట్ కైలష్ వెళ్లేందుకు త్వరలోనే అనుమతి..టిబెట్ పీఠభూమిలో కొలువుదీరిన మౌంట్ కైలాష్ ప్రాంతాన్ని శివుని నివాస స్థలంగా భావిస్తారు. అయితే ఈ ప్రాంతానికి ఇండియా నుంచి భక్తులు సందర్శించేందుకు త్వరలోనే అనుమతి లభించనుంది. ఈ విషయాన్ని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులు వెల్లడించారు.టిబెట్ పీఠభూమిలో కొలువుదీరిన మౌంట్ కైలాష్ ప్రాంతాన్ని శివుని నివాస స్థలంగా భావిస్తారు. అయితే ఈ ప్రాంతానికి ఇండియా నుంచి భక్తులు సందర్శించేందుకు త్వరలోనే అనుమతి లభించనుంది. ఈ విషయాన్ని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులు వెల్లడించారు. ఇండియా – చైనా సరిహద్దు ప్రాంతంలోని పితోరాఘర్ జిల్లా నబిధాంగ్ నుంచి లిపులేక్ పాస్ వరకు రోడ్ కట్టింగ్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దాదాపు ఆరున్నర కిలోమీటర్ల వరకు ఈ పనులు జరుగుతున్నాయని చెప్పారు. సెప్టెంబర్ నాటికి ఇవి పూర్తయితే భక్తలు సందర్శన కోసం మౌంట్ కైలాష్కు అనుమతి ఉంటుందని తెలిపారు.ఇదిలా ఉండగా కైలాష్ – మానసరోవర్ యాత్ర కరోనా మహమ్మరి వల్ల ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ యాత్రను ప్రారంభించలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఈ యాత్రను ప్రారంభించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వాతావరణం అనుకూలిస్తే సెప్టెంబర్ నాటికే రోడ్ కట్టింగ్ పనులు పూర్తవుతాయని బీఆర్వో చీఫ్ ఇంజనీర్ విమల్ గోస్వామి తెలిపారు. ఇదిలా ఉండగా శివుని నివాస స్థలంగా భావించే మౌంట్ కైలాష్ ప్రాంతాన్ని దర్శించుకోవాలని ఎంతోమంది భక్తులు కోరుకుంటారు. త్వరలోనే అక్కడికి వెళ్లేందుకు అనుమతి లభించడంతో శివభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.