Telangana: కుక్కతో వస్తాడు.. అర్థరాత్రి పండ్లు ఎత్తుకెళ్తాడు.. మూడు సంవత్సరాలుగా ఇదే తంతు.. కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్..కావేవి అపహరణకు అనర్హం అన్న విధంగా ఒక వ్యక్తి కుక్కతో వచ్చి తోపుడు బండి పై ఉన్న పండ్లను దొంగతనం చేశాడు. అర్థరాత్రి పండ్లను దొంగలిస్తున్న వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో ఆ దొంగ బండారం బట్టబయలు అయ్యింది. అయితే ఆ దొంగ వాళ్ల భార్యకు అనారోగ్య సమస్య ఉందట. అందుకే డబ్బులు పెట్టి కాస్టిలి ఫ్రూట్స్ కొనే స్థోమత లేక ఇలా అర్థరాత్రి రోడ్డు పక్కన ఉండే తోపుడు బండ్లు ను టార్గెట్ చేసుకుని గత మూడేళ్లుగా పండ్లుమూడు సంవత్సరాలుగా ప్రూట్స్ దొంగతనం..
కుక్కతో వచ్చి అర్థరాత్రి చోరీ..
అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..
కావేవి అపహరణకు అనర్హం అన్న విధంగా ఒక వ్యక్తి కుక్కతో వచ్చి తోపుడు బండి పై ఉన్న పండ్లను దొంగతనం చేశాడు. అర్థరాత్రి పండ్లను దొంగలిస్తున్న వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో ఆ దొంగ బండారం బట్టబయలు అయ్యింది. అయితే ఆ దొంగ వాళ్ల భార్యకు అనారోగ్య సమస్య ఉందట. అందుకే డబ్బులు పెట్టి కాస్టిలి ఫ్రూట్స్ కొనే స్థోమత లేక ఇలా అర్థరాత్రి రోడ్డు పక్కన ఉండే తోపుడు బండ్లు ను టార్గెట్ చేసుకుని గత మూడేళ్లుగా పండ్లు దొచుకెళ్తున్నాడు.ఖమ్మం జిల్లా సత్తుపల్లి రింగ్ సెంటర్ లో చిపు సురేష్ అనే వ్యక్తి తోపుడు బండి పై పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ఎప్పటి లానే ఉదయాన్నే తోపుడు బండి వద్దకు వచ్చి చూసుకునే సరికి బండి లో ఉండాల్సిన పండ్లు సగం మాయం అయ్యాయి. అనుమానం వచ్చిన వ్యాపారి సురేష్ సీసీ కెమెరా ను పరిశీలించాడు. ఒక దొంగ అర్థరాత్రి తన కుక్కతో వచ్చి పట్టా కప్పి ఉంచిన తోపుడు బండి లో ఉన్న డ్రాగన్, కివి,దానిమ్మ,యాపిల్ ఫ్రూట్స్, దోచుకెళ్లాడు. ఈవిజువల్స్ సీసీ కెమెరా లో రికార్డు అయ్యింది.