Koushik Reddy: మరో వివాదంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి.. దళిత బంధుని తొలిసారిగా అమలు చేసిన నియోజకవర్గంలోనే..హుజురాబాద్ న్యూస్, జూలై 21: హుజురాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పటికే ఈటెల రాజేందర్పైన 20 కోట్ల సుపారి ఇచ్చి చంపిస్తానంటూ ఆయన అన్నట్టు వచ్చిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం..హుజురాబాద్ న్యూస్, జూలై 21: హుజురాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పటికే ఈటెల రాజేందర్పైన 20 కోట్ల సుపారి ఇచ్చి చంపిస్తానంటూ ఆయన అన్నట్టు వచ్చిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. ఓ సామాజిక వర్గంపై ఆయన చేసిన కామెంట్లు రాజకీయ ప్రకంపలను రేపాయి. చివరకు తాను సదరు సామాజిక వర్గానికి చెందినవారిని ఏ మాటలు అనలేదని వివరణ ఇచ్చుకున్నా ఆ మంటలు ఇంకా చల్లార లేదు. అలాంటి చోటనే కౌశిక్ రెడ్డి మరొక వివాదంలో చిక్కుకున్నారు.ఎమ్మెల్సీగా ఉన్న కౌషిక్ రెడ్డికి ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. అయితే ఆ వాహనానికి ప్రోటోకాల్ డ్రైవర్గా ఉండే వ్యక్తిని దూషించాడని కరీంనగర్ సీపీ సుబ్బరాయుడుకి సదరు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మరోసారి కౌశిక్ రెడ్డిని వివాదంలోకి లాగింది. కౌశిక్ రెడ్డి దగ్గర పనిచేస్తున్న ప్రోటోకాల్ డ్రైవర్ దళితుడు కావడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. కౌశిక్ రెడ్డి, అతని పిఏతో పాటు ఆయన పర్సనల్ సెక్రెటరీ సైతం దళితుడని వేధిస్తున్నాడని కరీంనగర్ సిపికి ఫిర్యాదు చేశాడు ప్రోటోకాల్ డ్రైవర్.
‘మీ దళితులు ఇంకా మారరా..’ అంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే హుజురాబాద్లో అనేక వివాదాల్లో ఇరుక్కున్న కౌశిక్ రెడ్డికి దళిత బంధు అమలు చేసిన ఆ నియోజకవర్గంలోనే ప్రభుత్వ కేటాయించిన ప్రోటోకాల్ డ్రైవర్ని దళితులంటూ దూషించడం పట్ల దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.