Guntur Kaaram: మహేష్ మూవీ కోసం ప్రత్యేక సెట్..సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుందటమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ముందుగా ఈ మూవీలో హీరోయిన్ గా పూజాహెగ్డేను ఎంపిక చేశారు.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న నయా మూవీ గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ముందుగా ఈ మూవీలో హీరోయిన్ గా పూజాహెగ్డేను ఎంపిక చేశారు. కానీ ఉంచినని విధంగా ఈ మూవీ నుంచి తప్పుకుంది. దాంతో శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా చేశారు. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. ఇక ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతోంది. గుంటూరు కారం సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ముందుగానే అనౌన్స్ చేశారు. ఇక ఈ మూవీని మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు గురూజీ.ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేష్ లుక్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఇప్పటివరకు క్లాస్ సినిమాలు చేస్తూ వస్తున్న మహేష్ ఈ సినిమాతో మరోసారి తన మాస్ ను చూపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఇప్పుడు ఓ ప్రత్యేక సెట్ ను ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.ఓ భారీ యాక్షన్ సీన్ కోసం ఈ సెట్ ను ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. మహేష్ తోపాటు ఇతర తారాగణం కూడా ఈ సీన్ లో పాల్గొంటున్నారట. ఇక మూవీ టైటిల్ కు తగ్గట్టుగానే గుంటూరు బ్యాక్డ్రాప్ లో జరిగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మహేష్.