మనసారా నవ్వండి.. నవ్వించండి! అదే మీకు శ్రీరామరక్ష..నవ్వు నాలుగు విధాల చేటు అనేది ఒకప్పటి మాట. కానీ ప్రస్తుతం నవ్వు నాలబై విధాల మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును.. నేటి జీవన శైలి, గంటల తరబడి స్మార్ట్ ఫోన్ల వాడకం, ఉరుకుల పరుగుల జీవితం వెరసి మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి…నవ్వు నాలుగు విధాల చేటు అనేది ఒకప్పటి మాట. కానీ ప్రస్తుతం నవ్వు నాలబై విధాల మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును.. నేటి జీవన శైలి, గంటల తరబడి స్మార్ట్ ఫోన్ల వాడకం, ఉరుకుల పరుగుల జీవితం వెరసి మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి.ఏది ఏలా ఉన్నా అందమైన చిరునవ్వు ముందు అన్నీ దిగదుడుపే. మనసారా నవ్వితే వచ్చే అనుభూతి, ఆత్మవిశ్వాసాన్ని మరేదీ ఇవ్వలేదన్నది నిత్య సత్యం.ఆనందంగా ఉంటే అది ముఖ్యంలో వెల్లివిరుస్తుంది. ముఖకవళికలు, పెదాల ద్వారా తెలిసిపోతుంది. హాయిగా నవ్వితే మెదడుకి ప్రశాంత, మనసుకి ఆహ్లాదం కలుగుతుంది.ఇతరులను నవ్వుతూ పలకరిస్తే వచ్చే జవాబు మరింత పాజిటివ్‌గా ఉంటుంది. దీంతో రోజు వారీ పనులు కూడా సులువైపోతాయి. ఆత్మవిశ్వాసం, ఆనందం, సత్సంబంధాలు రెట్టింపవుతాయి. ఫలితంగా ఎదుటి వారు నిజాయితీగా మీకు దగ్గరవుతారు.నవ్వు అందాన్ని రెట్టింపు చేయడమేకాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కళ్లతో, నవ్వుతో ఎదుటివారి భావాలు, ప్రవర్తనను ఇట్టే కనిపెట్టేయవచ్చు. చిన్న చిరునవ్వుతో ఇతరుల సమస్యల్నీ దూరం చేసి వారిలోనూ ఆనందాన్ని నింపచ్చు.