Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక సమావేశం..! పునర్వ్యవస్థీకరణపై చర్చ.. కిషన్ రెడ్డి కొనసాగింపుపై ఉత్కంఠ..Modi Cabinet reshuffle buzz: కేంద్ర కేబినెట్ కీలక సమావేశం బుధవారం ఉదయం ప్రారంభం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగుతున్న ఈ సమావేశంలో కేంద్ర క్యాబినెట్ లో మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.Modi Cabinet reshuffle buzz: కేంద్ర కేబినెట్ కీలక సమావేశం బుధవారం ఉదయం ప్రారంభం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగుతున్న ఈ సమావేశంలో కేంద్ర క్యాబినెట్ లో మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి చర్చిస్తున్నారు. అయితే, రెండు రోజుల క్రితం ఐదు గంటల పాటు సమావేశం కొనసాగింది. త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ప్రచారం నేపథ్యంలో ఇవాళ్టి సమావేశంలో నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. పలువురు మంత్రులను కేంద్ర కేబినెట్ నుంచి తప్పించి.. పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలతోపాటు.. 2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్‌గా కేంద్ర కేబినెట్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీనికోసం పలువురిని కేంద్ర క్యాబినెట్ నుంచి తొలగించనున్నట్లు పేర్కొంటున్నారు. అయితే, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కేబినెట్లో ప్రాధాన్యత కల్పిస్తారని.. ఆ దిశగా బీజేపీ అగ్రనేతలు కసరత్తులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. త్వరలో జరగనున్న విస్తరణలో మరొకరికి చోటు కల్పిస్తారని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. దీంతో కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డిని కొనసాగిస్తారా.. లేదంటే కేబినెట్ నుంచి తొలగించి.. మరో ఇద్దరికి తెలంగాణ నుంచి అవకాశం ఇస్తారా అన్నది ఇవాళ్టి సమావేశం తర్వాత క్లారిటీ రానుంది.
అభినందనలు తెలిపిన బండి సంజయ్..
మరోవైపు తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు MP బండి సంజయ్ అభినందనలు తెలిపారు. మీ ఇద్దరి నాయకత్వంలో పార్టీ బలోపేతమవుతుందని ఆశిస్తున్నానన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి.. కిషన్‌రెడ్డి, ఈటల కృషి చేస్తారని ట్వీట్ చేశారు.