Sitara Ghattamaneni: ఆ దృశ్యం చూసి కంటతడి పెట్టుకున్నా.. సితార ఎమోషనల్సితార ఎదుగుదలతో ప్రౌడ్‌గా ఫీలవుతున్నారు మహేష్ బాబు. తాజాగా అమెరికా టైమ్స్ స్కేర్పై వెలిగి.. ప్రశంసలు అందుకుంటుంది.తన కుతూరు యాక్టివిటిని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సితార ప్రతిభను చూసి మురిసిపోతున్నారు. తాజాగా అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రోజైన… జులై 4న సితార నటించిన కమర్షియల్ యాడ్‌కు సంబంధించిన ఫోటోలను న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ పై ప్రదర్శించారు. దీనికి సంబంధిత విజువల్స్‌ను మహేశ్ బాబు తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకొని హ్యాపిగా ఫీల్ అయ్యారు. టైమ్స్ స్క్వేర్నే వెలిగిస్తున్నావు..!! నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. ఇలానే కొనసాగించు అనే కొటేషన్ రాసుకొచ్చారు. కీప్ ఇట్ ఆప్ అంటూ అశీర్వదించారు.మహేష్ పోస్ట్‌పై సితార కూడా తన స్పందన తెలియజేసింది. టైమ్స్ స్వ్కేర్‌పై తనని తాను చూసుకుని గట్టిగా అరిచినట్టు, భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నట్టు రిప్లై ఇచ్చింది. వీరిద్దరి మధ్య జరిగిన పోస్ట్ రిప్లైలపై పలువురు సినీ ప్రముఖులు, మహేశ్ బాబు అభిమానులు, నెటిజన్లు స్పందించారు. సితారకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించిందంటూ పొగడ్తలతో ముంచెత్తున్నారు. టైమ్స్ స్వ్కేర్‌పై మెరిసిన ఫస్ట్ స్టార్ కిడ్ అని గొప్పగా కీర్తిస్తున్నారు.ఇప్పటికే తన క్లాసికల్ డ్యాన్స్‌లో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది సితార. సర్కారు వారి పాట మూవీలోని ఓ ప్రమోషనల్ సాంగ్‌కు తన తండ్రితో కలిసి స్టెప్పులేశారు .అప్పటి నుంచి తన ట్యాలెంట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది సితార. రీజెంట్ గా సితార ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా 1.2 మిలియన్‌కి చేరింది.