Samantha Ruth Prabhu: ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిన సామ్.. సినిమాలకు దూరంఆమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనుందని తెలుస్తోంది. దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరం గా ఉండనుందట సామ్.స్టార్ హీరోయిన్ సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది సామ్. ఇక అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది ఈ భామ. ఆతర్వాత కొంతకాలానికే వీరు విడిపోయారు. సమంత, నాగ చైతన్య విడిపోవడంతో అభిమానులంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఎవరి పని వారు చేసుకుంటూ బిజీగా మారిపోయారు. ఇంతలో మరో పిడుగులాంటి వార్త చెప్పింది సామ్. మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నా అని తెలిపి అందరిని షాక్ కు గురిచేసింది. బెడ్ పై సెలైన్ బాటిల్ తో ఫోటోలు పెట్టి ఎమోషనల్ అయ్యింది. ఆతర్వాత చికిత్స తీసుకుంటూ ఇటీవలే కోలుకుంది ఈ భామ. చికిత్స తీసుకుంటూనే పలు సినిమాల్లోనూ నటించింది.
ఆమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనుందని తెలుస్తోంది. దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరం గా ఉండనుందట సామ్. ఈ ఏడాది మొత్తం ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలనుకుంటుందట.అందుకే కొత్త సినిమాలు ఏవీ ఒప్పుకోవడం లేదట. తీసుకున్న అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేసిందట సమంత. వచ్చే ఏడాదిలో కొత్త సినిమాలకు సైన్ చేయనుందట. ప్రస్తుతం సమంత రౌడీ బాయ్ విజయ్ దేవర కొండతో కలిసి ఖుషి అనే సినిమా చేస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మాత్రమే సామ్ పాల్గొంటారని తెలుస్తోంది. ఒక ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటానన్న సమంత నిర్ణయంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు.