Success Story: గులాబీల సాగుతో నెలలో రూ. 40 లక్షలు.. దేశ, విదేశాల్లో ఆ రైతుల పంటకు భారీ డిమాండ్..Dutch Rose Cultivation: వాలెంటైన్స్ డే రోజున డచ్ గులాబీలకు డిమాండ్. ఈ సమయంలో రోజుకు 3 లక్షల నుంచి 4 లక్షల గులాబీలు సరఫరా అవుతాయి. ఇదే గమనించిన ఆ రైతులు భారత్‌తోపాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.Rose Cultivation: దేశవ్యాప్తంగా గులాబీ తోటల సాగు పెరిగింది. అయితే మహారాష్ట్రలోని పూణె జిల్లాలో రైతులు పండించే డచ్ గులాబీ విషయం వేరు. ఈ గులాబి రసం చెరకు కంటే తియ్యగా ఉంటుందని అంటారు. డచ్ గులాబీకి మార్కెట్లో డిమాండ్ పెరగడానికి ఇదే కారణం. సాధారణ గులాబీతో పోలిస్తే డచ్ గులాబీ రేటు కూడా ఎక్కువ. దీని సాగు పుణె జిల్లాలోని చాలా మంది రైతుల అదృష్టాన్ని మార్చింది. డచ్ గులాబీలను సాధారణంగా మండపాన్ని, ఇంటిని అలంకరించేందుకు వివాహ వేడుకల్లో ఉపయోగిస్తారు. పూణేలోని మావల్ ప్రాంతంలో చాలా మంది రైతులు ఇప్పుడు సాంప్రదాయ పంటలను వదిలి డచ్ గులాబీలను సాగు చేయడం ప్రారంభించారు. ఈ రైతులు పండించిన డచ్ గులాబీలు నెదర్లాండ్స్, జపాన్, ఆస్ట్రేలియాలో విస్తృతంగా సరఫరా చేయబడుతున్నాయి.దీంతో రైతులకు లక్షల్లో లాభాలు వస్తున్నాయి. విశేషమేమిటంటే, రైతు ముకుంద్ థాకర్ డచ్ గులాబీలను పండించడానికి ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. దానితో 17 మంది రైతులు ఉన్నారు. ఈ రైతులు 55 ఎకరాల భూమిలో డచ్ గులాబీని సాగు చేస్తున్నారు. యూనియన్ రోజుకు 2 లక్షల గులాబీలను ఉత్పత్తి చేస్తోంది. వాటిని విక్రయించడం ద్వారా నెలలో రూ. 40 లక్షల వరకు సంపాదిస్తోంది.
రిటైల్ మార్కెట్లో 12 లక్షల గులాబీలు సరఫరా..
ప్రేమికుల రోజున డచ్ గులాబీలకు డిమాండ్ పెరుగుతుందని పుణేకు చెందిన రైతు చెప్పారు. ఈ సమయంలో రోజుకు 3 లక్షల నుంచి 4 లక్షల గులాబీలు ఉత్పత్తి అవుతాయి. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సంఘం నుంచి రిటైల్ మార్కెట్‌కు 12 లక్షల గులాబీలను సరఫరా చేయగా, విదేశాలకు 8 లక్షల గులాబీలు ఎగుమతి చేసినట్లుగా రైతు తెలిపారు.నేషనల్ హార్టికల్చర్ బోర్డు నుంచి 50% సబ్సిడీ..
ఈ సాగులోకి మొదటిసారి అడుగు పెట్టిన ముకుంద్ థాకర్ మాట్లాడుతూ, 2007లో తాను మొదట డచ్ గులాబీ సాగును ప్రారంభించినట్లుగా తెలిపారు. పూణే సమీపంలోని యెవాలే గ్రామంలోని 10 గుంతల భూమిలో పాలీహౌస్ను నిర్మించడం ద్వారా డచ్ గులాబీని మొదట పెంచారు. దీని ఫలితంగా డచ్ గులాబీల మంచి దిగుబడి వచ్చింది. దీని తరువాత, వారు యూనియన్‌గా ఏర్పడి దాని విస్తీర్ణాన్ని పెంచుకున్నారు. అదే సమయంలో పవన్ ఫూల్ ఉత్పాదక సంఘం చాలా మంచి పని చేస్తుందని వ్యవసాయ అధికారి దత్తాత్రేయ పడ్వాల్ అంటున్నారు. ఈ ప్రాంత రైతులను గులాబీల సాగుకు చైతన్య పరుస్తున్నాడు. ఎకరంలో రూ.70 లక్షలు వెచ్చించి పాలీ హౌస్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీని పైన నేషనల్ హార్టికల్చర్ బోర్డు కింద 50% సబ్సిడీ లభిస్తుంది.
పాలీహౌస్లో తేమ 65-75% ఉండాలి..
ప్రత్యేక విషయం ఏంటంటే డచ్ గులాబీని పాలీహౌస్లో మాత్రమే పండిస్తారు. పాలీహౌస్ లోపల ఉష్ణోగ్రత 32-35 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. అలాగే తేమ 65-75% ఉండాలి. దీని వల్ల డచ్ గులాబీ దిగుబడి బాగా వస్తుంది. శీతాకాలంలో పంటను పండించడం మంచిది.