TSPSC Group 4 Exam: గ్రూప్ 4 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు.. బారీ బందోబస్తు మధ్య నేడు పరీక్షలుగ్రూప్-4 రాత పరీక్ష ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో పరీక్ష ప్రారంభంకానుండగా పరీక్ష కేంద్రాలకు గ్రూప్ 4 అభ్యర్ధులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. కొన్ని చోట్ల బస్సు సౌకర్యం లేకపోవడంతో అభ్యర్ధులు..హైదరాబాద్: గ్రూప్-4 రాత పరీక్ష ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో పరీక్ష ప్రారంభంకానుండగా పరీక్ష కేంద్రాలకు గ్రూప్ 4 అభ్యర్ధులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. కొన్ని చోట్ల బస్సు సౌకర్యం లేకపోవడంతో అభ్యర్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పరీక్ష కేంద్రాల్లోకి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అభ్యర్ధులను లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,878 పరీక్ష కేంద్రాలను కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు. దీంతో భారీ బందోబస్తు నడుమ నేడు రెండు పేపర్లకు గ్రూప్ 4 పరీక్ష జరనుంది. ఉదయం సెషన్ లో 9.30కు గేట్లు మూసివేశారు. 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది.ఎలాంటి ఇబ్బందులు కలిగించినా అటువంటి వారిపై క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. పరీక్షకు హాజరయ్యే మహిళా అభ్యర్ధులు మెడల్లో తాళి, కాలి మెట్టెలు తీయాల్సిన అవసరం లేదని ఇప్పటికే టీఎస్పీయస్సీ స్పష్టం చేసింది. అవికాకుండా ఇతర ఆభరణాలు ధరించినా, షూ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ధరించిన పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. కేవలం చెప్పులు మాత్రమే ధరించి రావలని సూచింది. తెలంగాణలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసిన అన్ని స్కూళ్లు, కాలేజీలకు ఈ రోజు సెలవు ప్రకటించింది సర్కార్.