Telangana: పెళ్లయిన రాత్రే వధువుకు కడుపు నొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్అయ్య బాబోయ్.. పాపం ఆ వరుడి పరిస్థితి తలుచుకుంటే నిజంగా జాలి వేస్తుంది. అంత గ్రాండ్గా పెళ్లి చేస్తే తెల్లారికే సరికే అంతా తుష్ అయ్యింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి…ఇది మాములు న్యూస్ కాదు. చదివితే మీ బుర్ర బ్లాంక్ అవుతుంది. గ్రేటర్ నోయిడాలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి ఈ వారం ప్రారంభంలో తెలంగాణలోని సికింద్రాబాద్కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లయిన రోజు రాత్రి యువతి సడన్గా కడుపులో నొప్పితో అల్లాడిపోయింది. పెళ్లి సందర్భంగా ఫుడ్ సరిగ్గా తినలేదు.. గ్యాస్ వల్ల ఏమో అనుకున్నారు. దగ్గర్లోని మెడికల్ స్టోర్లో ట్యాబ్లెట్స్ తెచ్చి ఇచ్చారు. ఆ తర్వాత కూడా పెయిన్ ఏ మాత్రం తగ్గలేదు. దీంతో వరుడి ఫ్యామిలీ మెంబర్స్ ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె భర్త, అత్తమామలకు నిర్ఘాంతపోయే న్యూస్ చెప్పారు. కొత్త పెళ్లి కూతురు ఏడు నెలల గర్భవతి అని.. చావు కబురు చల్లగా చెప్పేశారు. దీంతో ఆమె భర్తతో పాటు అత్తమామలకు ప్రపంచం తలకిందులైనట్లు అయిపోయింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే… ఒకరోజు తర్వాత ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.యువతి కుటుంబానికి ఆమె గర్భం గురించి తెలిసినా కూడా.. వరుడితో పాటు అతని కుటుంబ సభ్యలుకు తెలియకుండా విషయం దాచి పెట్టి… జూన్ 26, సోమవారం నాడు వివాహం చేశారు. పెళ్లికి ముందు ఇటీవలే తమ కుమార్తెకు కిడ్నీ స్టోన్స్ తొలగించే శస్త్రచికిత్స జరిగిందని, అందుకే ఆమె కడుపు వాచి.. ఎత్తుగా కనిపిస్తుందని.. వరుడి బంధువులకు తెలిపారు. కానీ పెళ్లయిన రోజు రాత్రే గుట్టు వీడిపోయింది. అయితే ఇరు కుటుంబాలు ఒక అంగీకారానికి వచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని నిర్ణయించాయి. వధువు కుటుంబీకులకు సమాచారం అందించగా, వారు సికింద్రాబాద్ నుంచి వచ్చి.. కుమార్తెతో పాటు ఆమె బిడ్డను వెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందిందని కానీ ఎవరూ ఫిర్యాదు చేయలేదని దన్కౌర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఇన్ఛార్జ్ సంజయ్ సింగ్ వెల్లడించారు.