Andhra Pradesh: ఎన్నికల మూడ్లోకి టీడీపీ.. నెల్లూరు సిటీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు..Nellore City TDP Candidate: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు చాలా నెలల సమయం ఉంది.. అయినప్పటికీ.. ప్రాధాన పార్టీలు తగ్గేదేలే అంటూ.. ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించాయి. ఓ వైపు అధికార పార్టీ వైసీపీ, మరోవైపు టీడీపీ, జనసేన..Nellore City TDP Candidate: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు చాలా నెలల సమయం ఉంది.. అయినప్పటికీ.. ప్రాధాన పార్టీలు తగ్గేదేలే అంటూ.. ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించాయి. ఓ వైపు అధికార పార్టీ వైసీపీ, మరోవైపు టీడీపీ, జనసేన ఇప్పటినుంచే ప్రజలకు చేరువయ్యేందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు.. నెల్లూరు రాజకీయాలను మరింత హీటెక్కించింది. నెల్లూరు సిటీలో పోటీకి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాళ్లు.. ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ ప్రతిసవాళ్లు.. ఇలా వారం నుంచి రాజకీయాలు మరింత వేడెక్కాయి. వీరిద్దరి హాట్ కామెంట్ల మధ్య టీడీపీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించింది. నెల్లురు సిటీ నుంచి పొంగూరు నారాయణ పోటీ చేస్తారని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. గత ఎన్నికల్లోనూ అనిల్ కుమార్ – నారాయణ పోటీపడ్డారు. ఈ పోటీలో అనిల్ గెలుపొందారు. ఈసారి.. అంటే 2024 ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరి మధ్యే హోరాహోరీ పోటీ ఖాయంగా కనిపిస్తోంది.ఈ మధ్యే నెల్లూరు సిటీ నుంచి ఆనం రాంనారాయణ పోటీ చేయాలని అనిల్ కుమార్ సవాల్ విసిరారు. ఈ కామెంట్లపై స్పందించిన ఆనం.. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడినుంచైన పోటీకి రెడీ అంటూ అనిల్ కు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించడం నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు రెండు రోజుల్లో నెల్లూరులోకి ప్రవేశించనుంది లోకేష్ యువగళం యాత్ర. దీంతో రాజకీయ సమరం మరింత వేడెక్కబోతుంది.