Shaitan: సైతాన్ సిరీస్లో నటించిన ఈ నటి ఎవరో..?ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.?మహా వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బోల్డ్ కంటెంట్, బూతులు, వైలెన్స్ తో ఈ వెబ్ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.ఇటీవల వచ్చిన వెబ్ సిరీస్ల హంగామా ఎక్కువగా కనిపిస్తోంది. ఓటీటీల పుణ్యమా అని బోలెడన్ని వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక రీసెంట్ డేస్ లో వచ్చి ప్రేక్షకులను మెప్పించిన సిరీస్ ల్లో సైతాన్ ఒకటి. మహా వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బోల్డ్ కంటెంట్, బూతులు, వైలెన్స్ తో ఈ వెబ్ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో పాత్రల గురించి చెప్పుకుంటే..దేవియని శర్మ, కామాక్షి భాస్కర్ల, జాఫర్ సాదిక్, షెల్లీ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఇక పై ఫొటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా.? సైతాన్ సిరీస్ లో బోల్డ్ పాత్రలో నటించింది ఈమె
ఆమె పేరు షెల్లీ కిషోర్. సైతాన్ సిరీస్ లో హీరో తల్లిగా నటించి మెప్పించింది షెల్లీ కిషోర్. ఆమె నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ అమ్మడు మలయాళంలో చాలా సీరియల్స్ లో నటించి ఆకట్టుకుంది. మలయాళంలో పురుషోత్తమ్ అనే సీరియల్ తో పరిచయం అయ్యింది షెల్లీ .
ఆ తర్వాత వరుసగా సీరియల్స్ చేసిన షెల్లీ . మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన కేరళ కేఫ్ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యింది. ఇక ఇప్పుడు సైతాన్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సిరీస్ సక్సెస్ కావడంతో షెల్లికి తెలుగులో అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక ఈ బ్యూటీ నెట్టింటలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.